ఈక్వెడార్ జైలులో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ తొమ్మిది మంది మరణించారు. గతేడాది నుంచి దాదాపు 400మంది ఖైదీలు ఈ హింసాత్మక ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. రాజధాని క్విటోకు ఉత్తరాన్ ఉన్న ఎల్ జైలు వద్ద హింస చెలరేగింది. ఈ ఘర్షణలో చాలామంది మరణించినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. మృతదేహాలను బయటకు తీసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం ఇద్దరు ఖైదీలను హై సెక్యూరిటీ జైలుకు తీసుకెళ్తోండగా..ఈ హింస చెలరేగింది. అంతకుముందు జరిగిన హింసకు సూత్రధారిగా ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు లాస్ లోబోస్ ముఠా నాయకులలో ఒకరైన జోనాథన్ బెర్ముడెజ్ ఎల్ ఇంకాలో గతంలో జరిగిన మారణకాండకు కారణమని అధికారులు తెలిపారు. “ఈక్వెడార్ భద్రత, శాంతికి ముప్పు కలిగించే వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగాఉన్నామని అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమన్నారు. ఈక్వేడార్ శాంతికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.