Site icon HashtagU Telugu

Chandrayaan-3: చంద్రయాన్-3 చంద్రుని మీద అడుగుపెట్టలేదా?

Chandrayaan-4

Chandrayaan-4

Chandrayaan-3: మొదటి ప్రయోగంలో విఫలం చెందిన ఇస్రో చంద్రయాన్-3 ద్వారా చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ దృవంపై అంతరిక్ష పరిశోధనను ల్యాండ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. చంద్రుని ఉపరితలంపై రోవర్‌ను ల్యాండ్ చేసిన అమెరికా, చైనా మరియు పూర్వ సోవియట్ యూనియన్ తర్వాత నాల్గవ దేశంగా నిలిచింది. చంద్రయాన్3 ప్రయోగంలో భాగంగా జాబిల్లి దక్షిణ దృవంపై ఇస్రో దింపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ సమర్థంగా పరిశోధన కొనసాగిస్తున్నాయి. ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే అక్కడి వాతావరణ పరిస్థితులు, కొన్ని చిత్రాలను ఇస్రోకి పంపింది.చంద్రయాన్3 విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటుంటే చైనా మాత్రం తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది.

చంద్రయాన్‌-3 ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువాన్నితాకలేదని చైనా శాస్త్రవేత్త ఓయాంగ్‌ జియువాన్‌ స్పష్టం చేశారు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్3 విజయంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. విక్రమ్ ల్యాండర్ మరియు ప్రగ్యాన్ రోవర్‌లను నిద్రాణస్థితి నుండి పునరుద్ధరించడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న సమయంలో చైనా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చైనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. భారత్ విజయాన్ని జీర్ణించుకోలేపోతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Kabhi Apne Kabhi Sapne : అల్లు అర్జున్ కభి అప్నే కభి సప్నే..!

Exit mobile version