Site icon HashtagU Telugu

Xi Jinping: చైనా అధ్యక్షుడిగా మూడోసారి జిన్‎పింగ్..!

20221022 Cnp504

20221022 Cnp504

చైనా అధ్యక్షుడు జిన్‎పింగ్ ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు. చైనా అధ్యక్షుడిగా మూడోసారి జిన్‎పింగ్ ను జాతీయ మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అలాగే 205 మంది కేంద్ర కమిటీ సభ్యుల్ని, 171 మంది ప్రత్యామ్నాయ సభ్యులను, 25 మంది పొలిట్ బ్యూరో సభ్యుల్ని నియమించింది. కాగా.. కొన్ని వారాల కిందట జిన్‎పింగ్ ను ఆర్మీ హౌస్ అరెస్ట్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్’లో వారం రోజులపాటు జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాలలో భాగంగా ఆయనను మరో 5 ఏళ్లపాటు దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సెంట్రల్ కమిటీ తొలి సమావేశం జరిగిన తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీగా జిన్‌పింగ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జిన్‎పింగ్ మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. చైనా అధ్యక్ష పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టడానికి అనుమతినిచ్చే నిబంధనలను జిన్‌పింగ్ 2018లో రద్దు చేశారు. చైనాలో 1990 నుంచి ఒక నిబంధన ఉంది. రెండు కంటే ఎక్కువసార్లు అధ్యక్ష పదవిని చేపట్టలేరు. అయితే.. 2018లో ఈ పరిమితిని తొలగించే

సవరణకు మద్దతుగా చైనా నాయకులు ఓటు వేయడంతో, ఇప్పుడు జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్షుడు అయ్యే అవకాశాన్ని పొందారు. జిన్‌పింగ్ 2012లో తొలిసారిగా అధికారంలోకి వచ్చారు. ఆదివారం కొత్త సెంట్రల్ కమిటీ తన మొదటి సమావేశాన్ని ముగించిన తర్వాత Xi తదుపరి ప్రధాన కార్యదర్శిగా ప్రకటించబడుతుందని భావిస్తున్నారు. పార్టీ ప్రతినిధులు దాదాపు 200 మంది సభ్యులతో కూడిన కొత్త సెంట్రల్ కమిటీని కూడా ఎన్నుకున్నారు. కానీ పూర్తి జాబితాను వెల్లడించలేదు. చైనా రాష్ట్ర వార్తా సంస్థ ప్రకారం.. ఈ కమిటీ వచ్చే ఐదేళ్లపాటు పార్టీని పరిపాలిస్తుంది. కేంద్ర కమిటీలో చాలా కీలక పదవులు జిన్‌పింగ్‌ విధేయులకు కేటాయించబడ్డాయి.

Exit mobile version