Houthis : చైనానూ వదలని హౌతీలు.. ఆయిల్ ట్యాంకర్‌పై ఎటాక్

Houthis : యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్ల దాడులు ఆగడం లేదు. ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే ప్రతీ వాణిజ్య నౌకపైకి హౌతీలు మిస్సైళ్లు సంధిస్తున్నారు. 

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 03:50 PM IST

Houthis : యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్ల దాడులు ఆగడం లేదు. ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే ప్రతీ వాణిజ్య నౌకపైకి హౌతీలు మిస్సైళ్లు సంధిస్తున్నారు.  తాజాగా చైనా నౌకపైకి కూడా క్షిపణి వేశారు. శనివారం(మార్చ్‌ 23) సాయంత్రం యెమెన్‌ తీరం వద్ద నుంచి వెళ్తున్న చైనాకు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక ‘ఎంవీ హంగ్‌ పూ’పైకి హౌతీలు బాలిస్టిక్‌ మిసైళ్లను సంధించారు. యెమెన్‌ నౌకాశ్రయం మోఖా నుంచి 23 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్‌ కమాండ్‌(సెంట్‌ కామ్‌) ఆదివారం(మార్చ్‌ 24) ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వెల్లడించింది. పనామా ఫ్లాగ్‌తో నడుస్తున్న ఈ నౌక చైనాకు చెందినదని తెలిపింది. ‘ఎంవీ హంగ్‌ పూ’ ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక భారత్‌లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉందని తెలిసింది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరూ గాయపడలేదని సమాచారం.  నౌకలో మంటలు చెలరేగినప్పటికీ 30 నిమిషాల్లోనే వాటిని ఆర్పేశారు.  అనంతరం నౌక మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించింది.

We’re now on WhatsApp. Click to Join

చైనా, రష్యా నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీలు(Houthis)  తాజా దాడితో మాట తప్పారనే చర్చ మొదలైంది. ఇప్పుడు దాడికి గురైన ‘ఎంవీ హంగ్‌ పూ’ నౌక పేరు, యాజమాన్యం ఇటీవలే మారాయి. గతంలో దీనిని బ్రిటన్‌కు చెందిన యూనియన్‌ మారిటైమ్‌ సంస్థ నిర్వహించేది.ఎర్ర సముద్రంలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటివరకు భారత జెండా ఉన్న ఏ నౌకనూ హూతీలు లక్ష్యంగా చేసుకోలేదని చెబుతున్నారు. కాగా, ఎర్ర సముద్రంలోని అమెరికా యుద్ధనౌకలు టార్గెట్‌గా హూతీలు ప్రయోగించిన ఆరు డ్రోన్లను  కూల్చేసినట్లు అమెరికా ప్రకటించింది.

Also Read : Khammam: బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా..? బీజేపీలోకి నామా నాగేశ్వరరావు..?

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై గత కొంతకాలంగా దాడులు చేస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము కూడా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులను ఆపేస్తామని హౌతీలు అంటున్నారు. హౌతీల దాడుల కారణంగా ఆసియా నుంచి అమెరికా, యూరప్‌ వెళ్లే నౌకలకు దూరం పెరిగి ఖర్చు మోపెడవుతోంది. యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌లు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నా.. హౌతీలు వెనక్కి తగ్గడం లేదు.

Also Read :Fire in Meerut: మీర‌ట్‌లో ఘోరం.. మొబైల్ పేలి న‌లుగురు చిన్నారులు మృతి, ఇద్ద‌రి పరిస్థితి విష‌మం