Chinese Garlic Vs USA : చైనాను అమెరికా నిశితంగా అబ్జర్వ్ చేస్తోంది. చైనా నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా ఓ కన్నేసి ఉంచింది. ఇప్పుడు చైనా వెల్లుల్లిపై అమెరికాలో దుమారం రేగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహించే రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ రిక్ స్కాట్ చైనా వెల్లుల్లిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘చైనీస్ వెల్లుల్లి సురక్షితం కాదు. కమ్యూనిస్ట్ చైనాలో పండించే వెల్లుల్లి నాణ్యత, భద్రత ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది’’ అని పేర్కొంటూ అమెరికా వాణిజ్య శాఖ మంత్రికి సెనేటర్ రిక్ స్కాట్ లేఖ రాశారు. చైనా నుంచి దిగుమతి అయ్యే వెల్లుల్లి జాతీయ భద్రతపై ప్రభావం చూపుతోందని కామెంట్ చేశారు. దీనిపై అమెరికా ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మురుగు నీటిలో చైనా వెల్లుల్లిని సాగు చేస్తోందని.. ఆన్‌లైన్ వీడియోలు, కుకింగ్ బ్లాక్స్, డాక్యుమెంటరీల్లో ఆ విషయాన్ని చూపిస్తున్నారని రిక్ స్కాట్ వెల్లడించారు. చైనా వెల్లుల్లిలోని ఇంగ్రేడియెంట్స్‌ను పరీక్షించి, పరిశీలించాలని డిమాండ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వివాదంపై అమెరికాలోని క్యూబెక్‌లో ఉన్న మెక్‌గిల్ యూనివర్సిటీ ‘ఆఫీస్ ఫర్ సైన్స్ అండ్ సొసైటీ’ 2017లోనే వివరణ ఇచ్చింది. చైనాలో వెల్లుల్లిని పండించడానికి మురుగును ఉపయోగిస్తున్నట్టు ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. చైనా వెల్లుల్లితో ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేసింది. మానవ వ్యర్థాలు.. జంతువుల వ్యర్థాల్లాగా ఎంతో సమర్థవంతమైన ఎరువులని తెలిపింది. ఒకవేళ మురుగును ఎరువుగా వాడినా ఇబ్బంది ఉండదని అప్పట్లో పేర్కొంది. వెల్లుల్లి ఎగుమతుల్లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారు. చైనా నుంచి వెల్లుల్లిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా(Chinese Garlic Vs USA) ఒకటి.