Nepal Vs India : మన పొరుగుదేశం నేపాల్ బరితెగించింది. ఏకంగా భారత్‌కు చెందిన సరిహద్దు భూభాగాలను కలుపుకొని కొత్త 100 రూపాయల కరెన్సీ నోట్లను ముద్రించేందుకు రెడీ అవుతోంది. ఈ నోట్లను ముద్రించేందుకు సంబంధించిన కాంట్రాక్టును చైనా ప్రభుత్వ కంపెనీ ‘ది చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్’కు అప్పగించింది.
Also Read :India Vs China : బార్డర్‌లో స్వీట్లు పంచుకోనున్న భారత్-చైనా సైనికులు.. ఎందుకంటే ?
ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల కంపెనీలు నేపాల్ రూ.100 నోట్లను(Nepal Vs India) ప్రింట్ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ బిడ్లు దాఖలు చేశాయి. అయితే ‘నేపాల్ రాష్ట్ర బ్యాంక్’ మాత్రం ఆ కాంట్రాక్టును చైనాకు కట్టబెట్టేందుకు మొగ్గుచూపింది. ఇందులోని నేపాల్ మ్యాప్‌లలో ఇష్టారాజ్యంగా కీలకమైన మార్పులు చేశారు. భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను నేపాల్ మ్యాప్‌లో కలుపుకున్నారు. ఈ ప్రాంతాలను మ్యాప్‌లో చేరుస్తున్నట్లుగా నేపాల్ రాజ్యాంగంలో 2020 జూన్ 18న సవరణలు కూడా చేశారు. ఈ మ్యాప్‌తో కూడిన రూ.100 నోట్ల ప్రింటింగ్‌కు నేపాల్ ప్రభుత్వ మంత్రి మండలి ఆమోదం కూడా లభించింది. అంటే.. నేపాల్ అధికారికంగా ఈ మొత్తం ప్రక్రియను ముందుకు తీసుకుపోతోంది.
Also Read :Diwali 2024: ఈ ఆలయం దీపావళి నాడు మాత్రమే తెరవబడుతుంది..!
వ్యూహాత్మక ఉద్దేశంతోనే ఈ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ బాధ్యతను చైనాకు నేపాల్ అప్పగించినట్లు తెలుస్తోంది. దాదాపు 30 కోట్ల 100 రూపాయల కొత్త నోట్ల ప్రింటింగ్ కోసం చైనా కంపెనీకి రూ.75 కోట్లను నేపాల్ ప్రభుత్వం చెల్లిస్తోందని సమాచారం. అంటే రూ.3000 కోట్లు విలువైన రూ.100 నోట్ల ప్రింటింగ్‌కు రూ.75 కోట్లు ఖర్చు పెడుతున్నారన్న మాట. నేపాల్ ఇష్టారాజ్యంగా మ్యాప్‌ను మార్చుకోవడాన్ని భారత్ గతంలోనే తీవ్రంగా ఖండించింది. లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్‌లను మ్యాప్‌లో కలుపుకోవడంపై అభ్యంతరం తెలిపింది. కాగా, భారత్‌లోని ఐదు రాష్ట్రాలు సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో నేపాల్‌కు దాదాపు 1,850 కి.మీ మేర బార్డర్ ఉంది. ఈ సరిహద్దుల్లో ముమ్మర భద్రత ఉంటుంది.