Chinese Spy : భారత్ లో చైనా మహిళా గూఢచారి.. ప్లాన్ ఏమిటంటే..!

భారత్‌లో ఉన్న టిబెటన్ మత గురువు దలైలామా (Dalai Lama) పై గూఢచర్యం చేసేందుకు చైనా ఓ మహిళను పంపిందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి.

భారత్‌ (India) పైకి చొరబడేందుకు చైనా (China) ఎన్నో విఫల ప్రయత్నాలు చేసింది. తన దుర్మార్గపు పన్నాగంలో విఫలమైంది. ఇప్పుడు చైనా పన్నిన కొత్త కుట్ర బట్టబయలైంది.  భారత్‌లో ఉన్న టిబెటన్ మత గురువు దలైలామా (Dalai Lama) పై గూఢచర్యం చేసేందుకు చైనా ఓ మహిళను పంపిందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి.  ఈ మహిళ భక్తుల మధ్య ఉంటూ దలైలామాపై నిఘా పెట్టేందుకు వచ్చినట్టు గుర్తించారు. అయితే అంతకుముందే బీహార్ (Bihar) పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.  గయా సిటీ పోలీస్ ఎస్పీ అశోక్ ప్రసాద్ అనుమానిత మహిళను ఇప్పుడు విచారిస్తున్నారు. ఆ మహిళ వేసిన గూఢచర్యం స్కెచ్‌ ను కూడా పోలీసులు విడుదల చేశారు. దలైలామా (Dalai Lama) ప్రతిరోజూ ఉపన్యాసాలు ఇవ్వడానికి వచ్చే బోధ్‌ గయలోని కాలచక్ర గ్రౌండ్ వెలుపల ఈ గూఢచారి మహిళను (Chinese Female Spy) స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీహార్ (Bihar) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుమానిత చైనా మహిళ పేరు సాంగ్ జియోలాన్. ఆమె 2019లో కూడా భారత్‌కు వచ్చిందని అంటున్నారు. నేపాల్‌లో కొన్ని రోజులు గడిపిన తర్వాత ఇటీవల ఆమె బోద్‌ గయాకు చేరుకుందని వెల్లడించారు.   దలైలామా (Dalai Lama) యొక్క మూడు రోజుల ఉపన్యాస కార్యక్రమం డిసెంబర్ 29 నుండి బీహార్‌లోని బోద్ గయాలో ప్రారంభమైంది. ఈ మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు బోధ్‌ గయా చేరుకున్నారు. దలైలామా (Dalai Lama) డిసెంబర్ 22న బోధ్ గయ చేరుకున్నారు. ఒక నెల రోజులు ఆయన బీహార్ లోనే ఉండనున్నారు. బుద్ధగయలోని టిబెట్ ఆలయంలో ఆయన బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ భక్తి, అంకితభావం, విశ్వాసంతో కూడిన ఈ సమావేశం లక్ష్యంగా చైనా చాలా ప్రమాదకరమైన కుట్ర పన్నిందని బట్టబయలైంది. చైనా గూఢచారి మహిళ (Chinese Female Spy) ముఖం పోస్టర్ ను బీహార్ పోలీసులు విడుదల చేశారు. భక్తుల రద్దీలో కలిసిపోయి దలైలామాకు దగ్గరగా వెళ్ళాలి అనేది ఆమె ప్లాన్ అని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒకింత ఊరట లభించింది.

చైనా విఫల ప్రయత్నాల లిస్టు పెద్దదే:

గతంలో 15వ లామా పేరును ప్రకటించేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ తర్వాత నలంద బౌద్ధ సంప్రదాయానికి చెందిన ఇండియన్ హిమాలయన్ కౌన్సిల్ చైనా యొక్క అలాంటి ప్రయత్నాలను తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. దలైలామా (Dalai Lama) తర్వాత కొత్త లామా చైనాకు చెందిన వారు కాదని లేదా చైనా నియంత్రణలో ఉన్న టిబెట్ ప్రాంతానికి చెందినవారు కాదని లడఖ్ బౌద్ధ సంఘం కూడా స్పష్టం చేసింది. కొత్త లామా గురించి.. దలైలామా (Dalai Lama) తుది నిర్ణయం తీసుకుంటారు.

Also Read:  Russian VIPs : 3 రోజుల్లో ఇద్దరు రష్యా వీఐపీల అనుమానాస్పద మరణాలు