Site icon HashtagU Telugu

China + Pakistan: పాక్‌ ఆయుధాలన్నీ మేడిన్ చైనా.. చైనా ఉత్పత్తులన్నీ బైకాట్ చేద్దామా ?

China + Pakistan India Vs Pakistan China Weapons To Pakistan

China + Pakistan:‘‘పాకిస్తాన్‌‌కే మా ఫుల్ సపోర్ట్’’ అని చైనా మొదటి నుంచీ అంటోంది. భారత్‌తో యుద్ధానికి దిగితే పాకిస్తాన్‌కు సపోర్ట్ అందిస్తామని చైనా తేల్చి చెబుతోంది. పాకిస్తాన్, భారత్ యుద్దం జరగాలని..  తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడాలని చైనా కోరుకుంటోంది. యాపిల్ లాంటి పెద్దపెద్ద కంపెనీలు భారత్‌ను వీడాలనేది చైనా స్కెచ్. అందుకే పాకిస్తాన్‌తో భారత్‌కు యుద్ధం చేయించాలని కుట్రలు పన్నుతోంది. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ ఆర్మీతో పాటు చైనా నిఘా సంస్థల హస్తం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే పక్కా ఆధారాలు లభించాకే దీన్ని మనం ధ్రువీకరించగలం. ఇంతకీ పాకిస్తాన్‌ సైన్యానికి చైనా ఎలాంటి సాయం చేయగలదు ? ఇప్పటిదాకా పాక్ సైన్యానికి చైనా చేసిన  సాయం ఏమిటి ? మనం తెలుసుకుందాం..

Also Read :India Attack Plan : మానవరహిత విమానాలతో పీఓకేపై ఎటాక్.. తజకిస్తాన్ నుంచి వార్ ?

చైనా ఉత్పత్తులు.. మనదేశంలో ఇంకా అవసరమా ? 

ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఆరో ప్రాణం చైనా. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం డీలా పడింది. ఖజానాలో చిల్లిగవ్వ లేదు. అప్పులపై ఆధారపడి పాకిస్తాన్ ప్రభుత్వం నడుస్తోంది. అయినా భారత్‌కు సవాళ్లు విసిరేంత ధైర్యం పాకిస్తాన్‌కు ఎక్కడి నుంచి వస్తోంది ? అంటే.. చైనా నుంచే వస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చైనా, పాకిస్తాన్‌ సైన్యాల మధ్య ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఏవైనా యుద్ధాలు జరిగితే పరస్పరం సహకరించుకోవాలనే సీక్రెట్ అగ్రిమెంట్లు కూడా ఉన్నాయని అంటారు. అమెరికా నుంచి చైనాకు ముప్పు ఉంది. ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే..  పాకిస్తాన్ వైపు నుంచి సాయం పొందాలనేది చైనా లాంగ్ టర్మ్ ప్లాన్. పాకిస్తాన్, చైనా రెండూ అణ్వాయుధ దేశాలే కాబట్టి.. అమెరికాకు చెమటలు పట్టించొచ్చు అనేది డ్రాగన్ స్కెచ్.  అందుకే ఇప్పుడు భారత్‌తో యుద్ధానికి రెడీ అవుతున్న పాకిస్తాన్‌కు చైనా మద్దతును ప్రకటించింది. ఎందుకంటే చైనాకు భారత్‌తో  స్నేహం కంటే దాని లాంగ్ టర్మ్ లక్ష్యాలే కీలకం. ఇంత కరాకండీగా వ్యవహరిస్తున్న చైనా ఉత్పత్తుల అమ్మకాలను మన దేశంలో ఆపేయాల్సిన అవసరం ఉంది.

Also Read :War Plan : యుద్ధ సన్నద్ధతపై కేంద్రం సమీక్ష.. పాక్ ఎక్కడ దాడులు చేయొచ్చు ?

81 శాతం ఆయుధాలు చైనా నుంచే.. 

పాకిస్తాన్‌(China + Pakistan) ప్రధానంగా ఐదు దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో చైనా ఉంది. పాకిస్తాన్ సైనిక కొనుగోళ్లలో 81 శాతం చైనా నుంచే జరుగుతుంటాయి. మిగతా సైనిక కొనుగోళ్ల కోసం స్వీడన్, రష్యా, అమెరికా, ఇటలీ దేశాలపై పాకిస్తాన్ ఆధారపడుతుంటుంది. భారత్‌తో యుద్ధమే మొదలైతే చైనా నుంచి పాకిస్తాన్‌కు నిరంతరాయంగా ఆయుధాల సప్లై జరుగుతుంది. యుద్ధం ముగిసే వరకు చైనా నుంచి పాక్‌కు సపోర్ట్ లభించే అవకాశం ఉంది. భారత్ – పాక్ యుద్ధం ఎంత ఎక్కువ కాలం జరిగితే.. చైనాకు అంత ఎక్కువ లాభం. ఈయుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ డీలా పడుతుందని చైనా అంచనా వేస్తోంది.

చైనా నుంచి పాక్‌కు అందే ఆయుధాలివీ.. 

Exit mobile version