Site icon HashtagU Telugu

Solar Great Wall : చైనా సోలార్ వాల్.. రెడీ అవుతున్న మరో అద్భుతం

Chinas Solar Great Wall Kubuqi Desert

Solar Great Wall : చైనా.. రేంజే వేరప్ప!! యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచేలా చైనా అద్భుత కట్టడాలను ఆవిష్కరిస్తోంది. చైనా అనగానే ‘ది గ్రేట్ వాల్’ గుర్తుకొస్తుంది. ఇప్పుడు చైనాలో మరో గ్రేట్ వాల్  రెడీ అవుతోంది. ఇంతకీ ఆ వాల్ ఏమిటి ? దానిలో అబ్బురపరిచే విశేషం ఏముంది ? అనేది తెలుసుకుందాం..

Also Read :Mumbai Terror Attacks : ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా భారత్‌కు!

సోలార్ పవర్ ఉత్పత్తిలో చైనా తనదైన రేంజులో దూసుకుపోతోంది. చైనా ఇప్పుడు నిర్మిస్తున్నది ‘ది గ్రేట్ సోలార్ వాల్’. చైనాలోని ఇన్నర్‌ మంగోలియా ప్రాంతంలో ఉన్న కబుకీ ఎడారిలో సోలార్ వాల్(Solar Great Wall) రెడీ అవుతోంది. దీన్ని ఏకంగా 400 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్నారు. ఈ వాల్ 5 కిలోమీటర్ల వెడల్పుతో ఉండనుంది. ఈ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు నుంచి ఏటా దాదాపు 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని డ్రాగన్ టార్గెట్‌గా పెట్టుకుంది. చైనా రాజధాని బీజింగ్‌ విద్యుత్తు అవసరాల కోసం ఈ సోలార్ వాల్‌ను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వాల్ నిర్మాణ దశలోనే ఉంది.  దాదాపు 5.4 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే కెపాసిటీ కలిగిన సోలార్‌ ప్యానల్స్‌ను ఇప్పటివరకు చైనా అమర్చింది. మిగతా పనులు వాయు వేగంతో జరుగుతున్నాయి. ఈ వాల్ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని డ్రాగన్ భావిస్తోంది.

Also Read :Kejriwal Vs BJP : ‘‘బీజేపీ తప్పుడు చర్యలను సమర్ధిస్తారా ?’’.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ లేఖ

సీ ఆఫ్ డెత్..

గతంలో కబుకీ ఎడారి నిర్మానుష్యంగా ఉండేది. దాన్ని ‘ సీ ఆఫ్ డెత్‌’ అని పిలిచేవారు. కబుకీ ఎడారిలో వేడి వాతావరణం ఉండటం ఈ సోలార్‌ ప్రాజెక్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఈ ఏడారి నడుమ పరుగెత్తే గుర్రం ఆకారంలో జున్మా సోలార్‌ పవర్‌ స్టేషన్‌ను నిర్మించారు. ఇది ఏటా 200 కోట్ల కిలోవాట్ పర్‌ అవర్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. దీనివల్ల 4 లక్షల మంది ప్రజల అవసరాలు తీరుతాయి.