Robot Dogs : రోబో డాగ్స్ రెడీ.. శత్రువులను కాల్చి పారేస్తాయ్

చైనా సైన్యం స్పీడుగా దూసుకుపోతోంది. దాని ఆర్మీలోకి రోబోలు కూడా అడుగు పెట్టాయి.

Published By: HashtagU Telugu Desk
Robot Dogs

Robot Dogs

Robot Dogs : చైనా సైన్యం స్పీడుగా దూసుకుపోతోంది. దాని ఆర్మీలోకి రోబోలు కూడా అడుగు పెట్టాయి. ఆటోమేటిక్‌ రైఫిల్‌‌తో శత్రు లక్ష్యంపైకి కాల్పులు జరిపే కెపాసిటీ కలిగిన రోబో డాగ్స్‌ను చైనా రెడీ చేసింది. ఇవి ఎవరో చెబుతున్న ఊహాగానాలు కావు.  చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంతేకాదు.. రోబో డాగ్స్‌ ఫైరింగ్ చేస్తున్న వీడియోలను కూడాా సీసీటీవీలో చూపించారు. ‘‘మా యుద్ధ తంత్రంలోకి సరికొత్త సభ్యుడు వచ్చి చేరాడు. గస్తీ కాయడం, శత్రువును గుర్తించడం,  లక్ష్యంపై దాడి చేయడం వంటి పనులన్నీ ఈ రోబో డాగ్ చేయగలదు. అవసరమైన ప్రదేశాల్లో మనుషుల స్థానాన్ని ఇది  భర్తీ  చేయనుంది’’ అని వీడియోలో చెప్పుకొచ్చారు. ఇటీవల కంబోడియాలో నిర్వహించిన ‘గోల్డెన్‌ డ్రాగన్‌-2024’ యుద్ధ విన్యాసాలలో రోబో డాగ్‌లను చైనా ప్రదర్శించిందని.. అక్కడ షూట్ చేసిన వీడియోనే సీసీటీవీలో ప్రసారం చేశారని తెలుస్తోంది. ఈ యుద్ధ విన్యాసాలలో చైనా, కంబోడియా, వియత్నాం దేశాల ఆర్మీ పాల్గొంది.

We’re now on WhatsApp. Click to Join

  • చైనా రోబో డాగ్స్(Robot Dogs) బ్యాటరీపై ఆధారపడి దాదాపు 3 గంటలు పనిచేస్తాయి. ముందుకు, వెనక్కు, పడుకోవడం, దూకడం వంటివి చేయగలవు.
  • రోబో డాగ్స్ లోపల మ్యాపింగ్ టెక్నాలజీ ఉంటుంది. దాని ఆధారంగా అవి మార్గాన్ని చూస్తూ..  ముందుకు సాగుతాయి.
  • రోబో డాగ్స్‌లో సెన్సర్లు ఉంటాయి. 4డీ వైడ్‌ యాంగిల్‌ పర్సిప్షన్‌ సిస్టమ్‌ ఉంటుంది. వాటిని వాడుకొని  తమకు అడ్డు వచ్చే వస్తువులను గుర్తిస్తాయి.
  • చైనాకు చెందిన యూనీట్రీ సంస్థ ఈ రోబో డాగ్‌లను తయారు చేసింది. వీటి ధర దాదాపు రూ.2.50 లక్షలు.

Also Read :Vegetable Prices : సామాన్యులకు కూర‘గాయాలు’.. మండిపోతున్న ధరలు

  • చైనా రోబో డాగ్స్ బరువు 15 కిలోలు.
  • అమెరికా ఆర్మీ 2020 సంవత్సరం నుంచే రోబోడాగ్స్‌‌ను వాడటం మొదలుపెట్టింది.
  • అమెరికాకు పోటీగా రోబోలను సైన్యంలోకి ప్రవేశపెట్టే విషయంలో చైనా స్పీడుగా ముందుకు సాగుతోంది.
  • రోబోలను  సైన్యంలోకి తెచ్చే విషయంలో భారత్ ఇంకా చాలా పురోగమించాల్సి ఉంది.

Also Read : Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ

  Last Updated: 29 May 2024, 02:43 PM IST