China Drone : అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను చైనా తయారు చేసింది. ఈ డ్రోన్ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులు. అమెరికాకు చెందిన ‘సెస్నా 172’ విమానం కంటే ఇది కొంచెం ఎక్కువ పొడవే ఉంది. సెస్నా 172 రెక్కల పొడవు 11 మీటర్లే. ఈ డ్రోన్‌ను చైనా మొదటిసారీగా టెస్ట్ చేసింది. సిచవాన్ ప్రావిన్స్‌లో దీని పరీక్ష జరిగింది. దాదాపు 20 నిమిషాలపాటు అది గాల్లో చక్కర్లు(China Drone) కొట్టింది. చైనాకు చెందిన సిచువాన్ టెంగ్డెన్ సైన్స్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ దీన్ని తయారుచేసింది. ఈ డ్రోన్ 2 ఇంజిన్లతో పనిచేస్తుంది. 2 టన్నుల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు.
We’re now on WhatsApp. Click to Join
ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీలో ప్రస్తుతం చైనా, రష్యా, ఇరాన్, టర్కీ, ఫ్రాన్స్, అమెరికా దేశాలు ముందంజలో ఉన్నాయి. 2023 సంవత్సరం నాటికే చైనాలో దాదాపు 2,000కుపైగా సంస్థలు డ్రోన్ల తయారీ, డిజైనింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. గ్వాంగ్జు ప్రాంతానికి చెందిన ఈహంగ్ హోల్డింగ్స్ అనే సంస్థ తయారుచేసిన మానవ రవాణా డ్రోన్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా అనుమతులు ఇచ్చింది.ఈ ఏడాది జూన్‌లోనే చైనాకు చెందిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తయారుచేసిన హెచ్‌హెచ్-100 అనే కార్గో డ్రోన్‌ను టెస్ట్ చేశారు. 700 కేజీల లోడ్‌ను తీసుకొని 520 కిలోమీటర్లు ప్రయాణించే కెపాసిటీ దాని సొంతమని పరీక్షల్లో వెల్లడైంది. వచ్చే ఏడాది టీపీ2000 అనే డ్రోన్‌ను పరీక్షించేందుకు చైనా రెడీ అవుతోంది. అది అత్యధికంగా 2 టన్నుల లోడ్‌తో 2,000 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంటున్నారు.
Also Read :Mangala Gowri Vratam: శ్రావణమాస మంగళ గౌరీ వ్రతం విశిష్టత ఏమిటి.. ఈ వ్రతాన్ని ఎలా జరుపుకోవాలో తెలుసా?
చైనాలో ‘స్లీప్ మేకర్స్’ వృత్తి
ఈకాలంలో చాలామంది హాయిగా నిద్రపోలేకపోతున్నారు. ఈనేపథ్యంలో చైనాలో ‘స్లీప్ మేకర్స్’ అనే వృత్తి పుట్టుకొచ్చింది. ఉద్యోగ/వ్యక్తిగత/వ్యాపార/రాజకీయపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ నిద్రకు దూరమవుతున్న వారికి స్లీప్ మేకర్స్ ఎమోషనల్‌గా సపోర్ట్ అందిస్తారు. వారి బాధలు వింటారు. ముచ్చట్లు చెబుతూ వారిలోని ఆందోళనను దూరం చేస్తారు. ఫలితంగా వారు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. ఇప్పుడీ సేవలు చైనాలోని పలు నగరాల్లో ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. స్లీప్‌మేకర్స్ గంటకు దాదాపు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి సేవలు అందించే విషయంలో ‘సెవెన్ సెవెన్7’ అనే సంస్థ చైనాలో పాపులర్ అయింది.