Beautiful Governor Jailed : చైనాలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవాళ్లు తప్పు చేస్తే కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. తాజాగా గుయిజౌ ప్రావిన్స్‌లోని క్వియానన్ ప్రిఫెక్చర్ గవర్నర్ 52 ఏళ్ల జాంగ్ యాంగ్‌ను జైలులో వేశారు. జాంగ్ యాంగ్ ఒక మహిళ. ఆమెపై వచ్చిన అభియోాగాలు ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె తన గవర్నర్ హోదాను దుర్వినియోగం చేసి తన వద్ద పనిచేసే 58 మంది పురుష సిబ్బందితో లైంగిక సంబంధాలను పెట్టుకున్నారనే అభియోగాన్నినమోదు చేశారు. దాదాపు రూ.71 కోట్ల లంచాలు కూడా పుచ్చుకున్నారనే ఆరోపణలు జాంగ్ యాంగ్‌పై ఉన్నాయి. చైనా మీడియాలో ఆమెను బ్యూటిఫుల్ గవర్నర్‌గా(Beautiful Governor Jailed) అభివర్ణిస్తూ కథనాలు రావడం గమనార్హం.
Also Read :Hezbollah Number 2 : హిజ్బుల్లా నంబర్ 2 ఇబ్రహీం అఖీల్ హతం.. ఇతడు ఎవరు ?
జాంగ్ యాంగ్ ప్రస్తుత వయసు 52 ఏళ్లు. ఆమె 22 ఏళ్ల వయసులోనే చైనా కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో డిప్యూటీ స్థాయి హోదాకు చేరుకున్నారు. పండ్ల తోటలు, వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు జాంగ్ యాంగ్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ముసలివారిని ఆదుకునేందుకు తన సొంత డబ్బును ఆమె ఖర్చుపెట్టేవారని చెబుతుంటారు. ఈమేరకు వివరాలతో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
Also Read :US Voting : కమల వర్సెస్ ట్రంప్.. అమెరికాలో ‘ముందస్తు’ ఓట్ల పండుగ షురూ
అయితే ఈ ఏడాది జనవరిలో ఓ సంచలన పరిణామం చోటుచేసుకుంది. గుయిజౌ ప్రావిన్స్‌లోని క్వియానన్ ప్రిఫెక్చర్‌కు గవర్నర్‌గా జాంగ్ యాంగ్ వ్యవహరించేవారు. గుయిజౌ రేడియో, టీవీ స్టేషన్ ఒక సంచలన డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఆమె లంచాలు పుచ్చుకున్న వివరాలను అందులో ప్రస్తావించారు. జాంగ్ యాంగ్ సూచించిన కంపెనీలకే కొన్ని కాంట్రాక్టులను కేటాయించారని కథనాల్లో పేర్కొన్నారు. చైనా ప్రభుత్వ పెట్టుబడులను కూడా తనకు సంబంధించిన వారి కంపెనీల్లోకి మళ్లించుకున్నారనే అభియోాగాలను దాఖలు చేశారు. జాంగ్ యాంగ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తికి పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారని ఈకథనంలో ఆరోపించారు. ఆమె తన వద్ద పనిచేసే 58 మంది పురుష సిబ్బందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు. వారిలో కొందరు జాంగ్ యాంగ్ ఇచ్చే బహుమతుల కోసం.. మరికొందరు జాంగ్ యాంగ్ అధికార శక్తికి భయపడి లొంగిపోయారని కథనంలో పేర్కొన్నారు.