Paris Olympics: పారిస్ ఒలింపిక్స్-2024లో చైనా సత్తా చాటింది. ఈ సారి తొలి స్వర్ణం చైనాకే దక్కింది. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఒక్క పసిడి పతకంతో అగ్రస్థానాన్ని కోల్పోయిన చైనా ఈసారి బంగారు బోణీ కొట్టింది. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఇక ఈ పోటీలో దక్షిణ కొరియా రజతం, కజకిస్థాన్ కాంస్య పతకాలను గెలిచింది.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌లో చైనా జోడీ 16-12తో దక్షిణ కొరియా జంట కిమ్ జిహ్యోన్ మరియు పార్క్ హజున్‌లను ఓడించింది. తద్వారా చైనా తమ ప్రచారాన్ని గొప్పగా ప్రారంభించింది. తొలిదశ నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన చైనా.. ఆఖరులో కొరియా ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయారు.
పారిస్ ఒలింపిక్స్‌లో తొలి పతకం కజకిస్థాన్‌కు దక్కింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కజకిస్థాన్ జట్టు జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం చైనా, కొరియా మధ్య గోల్డ్ మెడల్ మ్యాచ్ జరుగుతోంది. కాగా భారత్ కు ఆదిలోనే దెబ్బ పడింది. 10 మీటర్ల రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన రమిత, అర్జున్‌లు క్వాలిఫయర్స్‌లోనే నిష్క్రమించారు. ఈ జోడీ ఆరో స్థానంలో నిలిచింది. కాగా సందీప్, ఎలవెనిల్ జోడీ 12వ స్థానంలో నిలిచింది. వీరిద్దరూ టాప్-2లో నిలిచిన నేపథ్యంలో చైనా, కొరియా మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది. కజకిస్థాన్, జర్మనీ మధ్య కాంస్య పతక పోరు జరగనుంది.
Also Read: DK Shiva Kumar : పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గంగా హారతి తరహాలో కావేరీ హారతి