Site icon HashtagU Telugu

China Spy Base In Cuba : అమెరికాకు చెక్.. క్యూబాలో చైనా స్పై బేస్ ?

China Spy Base In Cuba

China Spy Base In Cuba

China Spy Base In Cuba : అమెరికా ఆగడాలకు చెక్ పెట్టేందుకు చైనా కొత్త స్కెచ్ వేసింది..

తన బార్డర్స్ కు దగ్గరున్న దక్షిణ కొరియా, తైవాన్, జపాన్ లలో అమెరికా సైన్యం యాక్టివిటీకి ఆన్సర్ ఇచ్చేలా అదే విధమైన ఒక ప్లాన్ వేసింది.. 

ఇందులో భాగంగా అమెరికా పక్కనే ఉండే కమ్యూనిస్టు దేశం క్యూబాలో గూఢచారి స్థావరాన్ని (స్పై బేస్) ఏర్పాటు చేయబోతోంది. 

దీనికి సంబంధించి క్యూబాతో ఇప్పటికే చైనా రహస్య డీల్ కుదుర్చుకుందనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

క్యూబా.. ఈ చిన్న కమ్యూనిస్టు దేశం అమెరికా పక్కనే ఉంది. ఇది అమెరికాలోని ఫ్లోరిడా సిటీ నుంచి దాదాపు 160 కి.మీ దూరంలోనే ఉంటుంది. అందుకే చైనా ఇప్పుడు దానిపై ఫోకస్ చేసింది. చైనా, క్యూబా స్నేహ సంబంధాలకు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇవి రెండూ కమ్యూనిస్టు దేశాలే కావడం.. చైనాకు కలిసొచ్చే విషయం. అందుకే ఇద్దరి ఉమ్మడి శత్రువు అయిన అమెరికాను టార్గెట్ చేస్తూ ఒక ప్లాన్ వేశారని అంతర్జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. అమెరికాపై నిఘా పెట్టేందుకు.. అక్కడి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లను సీక్రెట్ గా సేకరించడానికి క్యూబా బార్డర్ లో ఒక గూఢచారి స్థావరాన్ని(ఈవ్‌డ్రాపింగ్ స్టేషన్‌)  ఏర్పాటు చేసేందుకు చైనా రెడీ అయింది అనేది ఆ వార్తల సారాంశం. క్యూబా బార్డర్ లోని అమెరికా నౌకాదళం యాక్టివిటీని కూడా ట్రాక్ చేయాలని డ్రాగన్ భావిస్తోందట. ఇందుకోసం ప్రతి సంవత్సరం క్యూబాకు కొన్ని వందల కోట్లు ఇచ్చేందుకు సైతం చైనా రెడీ అయిందనే ప్రచారం నడుస్తోంది.

Also read : Space Spying : చైనా శాటిలైట్ల రోబోటిక్ హ్యాండ్..అమెరికా అలర్ట్

అయితే ఈ న్యూస్ రిపోర్ట్స్ ను క్యూబా కొట్టిపారేసింది. అవన్నీ పుకార్లు అని స్పష్టం చేసింది. “ఆ న్యూస్ రిపోర్ట్  పూర్తిగా దుర్మార్గం, నిరాధారమైనది” అని క్యూబా ఉప-విదేశాంగ మంత్రి కార్లోస్ ఫెర్నాండెజ్ డి కాసియో కామెంట్ చేశారు. ఇక ఈ న్యూస్ రిపోర్ట్స్ లో వాస్తవం లేదని అమెరికా తెలిపింది. ఈమేరకు వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఓ ప్రకటన చేశారు. “మేము ఆ న్యూస్ రిపోర్ట్స్ చూశాము. అవి ఖచ్చితమైనవి కావు” అని ఆయన వెల్లడించారు. “చైనా,  క్యూబాలు కొత్త తరహా గూఢచారి స్టేషన్‌ను(China Spy Base In Cuba) అభివృద్ధి చేస్తున్నాయని మాకు తెలియదు”అని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి బ్రిగ్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ తెలిపారు.

Exit mobile version