China Vs Dalai Lama : దలైలామా వారసుడిపై చైనా శ్వేతపత్రంలో సంచలన విషయాలు

China Vs Dalai Lama : టిబెట్‌పై పట్టుకోసం చైనా అర్థం లేని షరతులు పెడుతోంది. 

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 12:30 PM IST

China Vs Dalai Lama : టిబెట్‌పై పట్టుకోసం చైనా అర్థం లేని షరతులు పెడుతోంది.  ప్రస్తుతం భారత్‌లోని ధర్మశాల(హిమాచల్‌ప్రదేశ్) లో ఉంటున్న టిబెట్ బౌద్ధ గురువు 14వ దలైలామా వయసు 88 ఏళ్లు. ఆయన వారసుడి ఎంపికపై ఏకంగా చైనా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. టిబెట్‌కు చెందిన వ్యక్తినే దలైలామాగా ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. ఎంపికయ్యే వాళ్లు తమ ప్రభుత్వం ఆమోదాన్ని తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని చైనా తేల్చి చెప్పింది.  టిబెట్‌ను చైనా ప్రభుత్వం జిజాంగ్‌ అని పిలుస్తుంది. టిబెట్‌ను స్వతంత్ర దేశంగా ఉంచాలని దలైలామా వినిపిస్తున్న వాదనను చైనా మొదటినుంచీ తోసిపుచ్చుతోంది. తన ఆక్రమణలో ఉన్న టిబెట్ భూభాగంలో ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తోంది. టిబెట్ స్వతంత్ర దేశ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తోంది. చైనాలో టిబెట్‌ను కలుపుకునే ప్రయత్నంలో భాగంగా.. ఇటీవల టిబెట్ దాకా హైస్పీడ్ ట్రైన్ ట్రాక్‌ను నిర్మించింది. వేగంగా టిబెట్‌కు ఆర్మీని తరలించే ప్లాన్‌తో ఈ రైల్వే ట్రాక్‌ను నిర్మించారని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘టిబెట్‌లో మేం మతస్వేచ్ఛకు అవకాశం ఇస్తాం. అక్కడ మాండరిన్‌తో పాటు టిబెటన్ భాష వినియోగంలో ఉంటాయి.  ప్రస్తుత దలైలామా మతపరమైన వ్యక్తి కాదు. ఆయన చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాడు. టిబెట్‌లో అన్ని మతాలవారు ఉన్నారు. అక్కడ టిబెటన్ బౌద్ధమత కార్యకలాపాలు జరిగే 1,700 ప్రదేశాలు ఉన్నాయి. టిబెట్‌లో దాదాపు 46,000 మంది బౌద్ధ సన్యాసులు, నాలుగు మసీదులు, 12,000 మంది ముస్లింలు, 700 మంది క్రైస్తవులు ఉన్నారు’’ అని చైనా విడుదల చేసిన శ్వేతపత్రంలో(China Vs Dalai Lama) ప్రస్తావించారు.