Site icon HashtagU Telugu

Defense Minister Removed : చైనా రక్షణమంత్రి మిస్సింగ్.. పదవి నుంచి తొలగింపు.. ఏమైంది ?

China

China

Defense Minister Removed : చైనా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండు నెలలుగా కనిపించకుండా పోయిన రక్షణ శాఖ మంత్రి జనరల్‌ లీ షాంగ్‌ ఫూను పదవి నుంచి తొలగించింది. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా ప్రకటించింది. రక్షణ మంత్రి పదవి నుంచి లీ షాంగ్‌ ఫూను తొలగించే ప్రతిపాదనకు చైనా నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కమిటీ అప్రూవల్ తెలిపింది. అయితే లీ షాంగ్‌ ఫూను పదవి నుంచి ఎందుకు తొలగించారనే(Defense Minister Removed) వివరాలను వెల్లడించలేదు.

We’re now on WhatsApp. Click to Join.

చివరిసారి ఆగస్టు 29న చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ‘చైనా – ఆఫ్రికా పీస్‌ అండ్‌ సెక్యూరిటీ ఫోరం’ సదస్సులో లీ షాంగ్‌ ఫూ కనిపించారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) హార్డ్‌వేర్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుగుతున్న తరుణంలో లీ షాంగ్‌ ఫూ  మిస్సయ్యారు. బహుశా ఆ కేసులో ఆయన పాత్రపై ఆధారాలు లభించడంతో జైలులో వేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  2017 నుంచి 2022 మధ్య చైనా ఎక్విప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కార్యకలాపాలను లీ షాంగ్‌ఫూ పర్యవేక్షించారు. ఆ టైంలోనే స్కాం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: Ayurveda Tips : మిగిలిపోయే అన్నం, కూరలను ఎన్ని గంటల్లోగా తినాలి ?

అంతకుముందు చైనా చైనా విదేశాంగ మంత్రి క్విన్‌ గాంగ్ కూడా ఇలాగే అదృశ్యమయ్యారు. కొన్ని వారాల తర్వాత ఆయనను విదేశాంగ మంత్రి పదవి నుంచి చైనా సర్కారు తొలగించింది. హాంకాంగ్ లోని చైనా వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారనే అభియోగాలతో  క్విన్‌ గాంగ్ ను జైలులో వేశారని అంటున్నారు.