Site icon HashtagU Telugu

China: చైనాలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఒకరి మృతి?

China

China

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచం మొత్తాన్ని గడగడ లాడించింది. కొన్ని లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఇది ఇలా ఉంటే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న నేపథ్యంలో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కూడా కలకలం రేపుతోంది. తాజాగా చైనాలో ఈ బర్డ్ ఫ్లూ కారణంగా ఒకరు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ తో మరణించడం అది ఇదే మొదటి కేసు అని చెప్పవచ్చు.

ఇటీవల డబ్ల్యూహెచ్వో సంస్థ ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రజలకు వ్యాప్తి చెందడం లేదు అని వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా దక్షిణ ప్రావిన్స్ ఆఫ్ గ్వాంగ్ డాంగ్ కు చెందిన 56 ఏళ్ల మహిళ ఏవియన్ ఇన్ ఫ్లూ ఎంజా H3N8 సబ్ టైప్ బారిన పడిన మూడో వ్యక్తి అని డబ్బులు డబ్ల్యూహెచ్ఓ సంస్థ వెల్లడించింది. ఆ ముగ్గురు కూడా చైనాకు చెందిన వారే అని, గత ఏడాదిలో ఆ రెండు కేసులు నమోదు అయినట్లు తెలిపింది. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్షియల్ సెంటర్ ఆఫ్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గత నెల చివర్లో H3N8 బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ మరణించింది.

కానీ ఆ మహిళా మరణానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. చైనాలో ఏవియన్ ఫ్లూ వైరస్ లు భారీ పౌల్ట్రీ ఇతర అడవి పక్షుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయని తెలిపారు. దాంతో అక్కడి ప్రజలు బర్డ్ ఫ్లూ కి గురవుతున్నారు. కాగా మహిళ అనారోగ్యానికి గురికాకముందే ఆమె సందర్శించిన మార్కెట్ సేకరించిన నమూనాలు ఇన్ ఫ్లుఎంజా AH3 ఉన్నట్లు తేలిందని డబ్ల్యు హెచ్ ఓ సంస్థ వెల్లడించింది.