Site icon HashtagU Telugu

Divorce Laws : చైనాలో ఇక విడాకులు టఫ్.. పెళ్లిళ్లు ఈజీ.. ఎందుకు ?

China Divorce Laws

Divorce Laws : చైనా అంటేనే వెరైటీ.  అక్కడి చట్టాలు చాలా టఫ్.  వివాహ వ్యవస్థలో సంస్కరణలు చేసే దిశగా చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. విడాకులు తీసుకునే ప్రక్రియను కఠినతరం చేసింది. ఈమేరకు ఓ ముసాయిదా బిల్లును రెడీ చేసింది. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

దేశంలో కుటుంబ వ్యవస్థకు అనుకూలంగా ఉండే సమాజాన్ని నిర్మించేందుకు చైనా నడుం బిగించింది. ఇందులో భాగంగా వివాహ చట్టాలలో పలు సవరణలు చేస్తూ ఓ ముసాయిదా బిల్లును తయారు చేసింది. దీన ప్రకారం విడాకులు తీసుకునేందుకు అప్లై చేసే వారు కొన్ని కఠిన నిబంధనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విడాకుల కోసం భార్య/భర్తలో ఎవరైనా ఒకరే అప్లై చేసిన సందర్భాల్లో.. మరొకరు ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తే డైవర్స్(Divorce Laws) మంజూరు కాదు. భార్యాభర్తలు ఇద్దరూ ఓకే చెబితేనే విడాకులు మంజూరు అవుతాయి. విడాకులను మంజూరు చేసేందుకు 30 రోజుల కూలింగ్ పీరియడ్‌ను కూడా చైనాా అమల్లోకి తేనుంది. ఈ వ్యవధిలో సెటిల్మెంట్ చేసి భార్యాభర్తలను కలిపే రాజీ ప్రయత్నాలు జరుగుతాయి. దేశంలో విడాకులు తీసుకునే వారి సంఖ్యను తగ్గించేందుకే ఈ చర్యలు చేపట్టింది. ఈ ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలను తెలియజేయాలని దేశ ప్రజలకు చైనా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందుకోసం ఈ ఏడాది సెప్టెంబరు వరకు గడువు ఇచ్చింది. ప్రజలు, న్యాయ నిపుణుల నుంచి వచ్చే సలహాలు, సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలను చైనా ప్రభుత్వం తీసుకోనుంది.

Also Read :1st Time Tricolour Hoisted : ఆ 13 పల్లెల్లో తొలిసారిగా మువ్వన్నెల జెండా రెపరెపలు

చైనాలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కోచోట ఒక్కో విధమైన వివాహ సంప్రదాయాలు ఉన్నాయి. అందువల్లే చాలా దశాబ్దాలుగా చైనాలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన వివాహం, విడాకుల నిబంధనలు అమలయ్యేవి. ఇకపై వాటన్నింటిని కలిపి జాతీయ స్థాయిలో అమలు చేయనున్నారు. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ లాగా !! చైనాలో ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో 34.3 లక్షల మంది పెళ్లిళ్లు చేసుకొన్నారు. గతేడాదితో పోలిస్తే పెళ్లిళ్ల సంఖ్య దాదాపు 4,98,000 తక్కువ. 2013 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో పెళ్లిళ్లు జరగడం ఇదే తొలిసారి. దేశంలో పెళ్లిళ్ల సంఖ్యను పెంచేందుకు చైనా చాలా కసరత్తు చేస్తోంది. చైనాలోని పలు రాష్ట్రాల్లో జననాల రేటును పెంచేందుకు పన్ను రాయితీలు, గృహాలపై సబ్సిడీలు, మూడో బిడ్డను కంటే రాయితీ విద్య వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. 25 ఏళ్లలోపు యువతులు వివాహం చేసుకొనేలా రాయితీలను కూడా ప్రకటిస్తున్నారు.