China Sketch : చైనా బిగ్ స్కెచ్‌ను అమలు చేస్తోంది. ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లను తాజాగా ఏకతాటిపైకి తెచ్చింది. చైనా – పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపెక్) ప్రాజెక్టును ఆఫ్ఘనిస్తాన్‌లోకి విస్తరించే దిశగా పాకిస్తాన్‌ను చైనా ఒప్పించింది. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ప్రత్యేక సమావేశం వేదికగా ఇందుకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంగీకారం తెలిపాయి. ఈ మీటింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ దగ్గరుండి మరీ.. పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇసాక్ దార్, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీల చేతులు కలిపించారు. మొత్తం మీద పొరుగుదేశాలను కలుపుకొని పోతూ.. చైనా సాగుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో సరిహద్దు వివాదం విషయంలో భారత్‌తోనూ చైనా రాజీకి వచ్చింది. ఇప్పుడు కీలకమైన సీపెక్ ప్రాజెక్టు కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లను చేరువ చేస్తోంది. అయితే సీపెక్ ప్రాజెక్టును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టులో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా భాగంగా చేయడాన్ని భారత్ తప్పుపడుతోంది.
Also Read :Chhattisgarh Encounter : అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం.. ఎవరీ కేశవరావు?
ఏమిటీ సీపెక్ ప్రాజెక్టు ?
- సీపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్.
- చైనా, పాకిస్తాన్ మధ్య కనెక్టివిటీని, వాణిజ్యాన్ని, ఆర్థిక సహకారాన్ని పెంచడానికి ఈ ప్రాజెక్టును చేపట్టారు.
- చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టులో సీపెక్ ప్రాజెక్టు ఒక భాగం.
- సీపెక్‌లో భాగంగా చైనా-పాకిస్తాన్ మధ్య రోడ్డు , జల, రైల్వే మార్గాలను బలోపేతం చేస్తారు. ఇరుదేశాల మధ్య ఇంధన నెట్‌వర్క్‌లను బలోపేతం చేస్తారు.
- చైనాలోని షిన్ జియాంగ్ ఉయ్‌గుర్ ప్రాంతం నుంచి మొదలుకొని పాకిస్తాన్‌లోని గ్వాదర్, కరాచీ పోర్టుల వరకు అన్ని రకాలుగా కనెక్టివిటీని పెంచడమే సీపెక్ ప్రాజెక్టు లక్ష్యం.
- చైనా, పాక్‌ల(China Sketch) మధ్య పవర్ ప్లాంట్లు, పైపు లైన్ల నెట్‌వర్క్‌లను కూడా ఏర్పాటు చేస్తారు.
- ఈ ప్రాజెక్టుతో పాకిస్తాన్ మౌలిక సదుపాయాలపై పూర్తి పట్టును సాధించాలని చైనా భావిస్తోంది.
- ఇప్పటికే చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్న పాకిస్తాన్.. చైనా చెప్పినట్టుగా తలాడిస్తూ సీపెక్ ఉచ్చులో విలవిలలాడుతోంది.
- తాజాగా ఈ ఉచ్చులో ఆఫ్ఘనిస్తాన్ కూడా పడింది.
Also Read :Drones : కోల్‌కతా గగనతలంలో డ్రోన్ల కలకలం.. రంగంలోకి రక్షణశాఖ
సగం ధరకే పాకిస్తాన్‌కు యుద్ధ విమానాలు
- చైనాతో పాకిస్తాన్ మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది.
- ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్స్ J-35A లను పాకిస్తాన్‌కు సగం ధరకే అమ్మేందుకు చైనా రెడీ అయింది. ఈమేరకు ఇరుదేశాలు ఒప్పందం కూడా చేసుకున్నాయి.
- ఈ ఒప్పందం ప్రకారం 30 అత్యాధునిక ఐదోతరం J-35A ఫైటర్ జెట్స్‌ను 2025 ఆగస్టులోగా పాకిస్తాన్‌కు చైనా అందించనుంది.