చైనా తన జీరో కోవిడ్ (zero-COVID policy) విధానాన్ని ఎత్తివేస్తే.. దాదాపు 13 లక్షల నుంచి 21 లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడొచ్చట. చైనాలో వ్యాక్సినేషన్ తక్కువగా జరగడం, టీకా బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళు తక్కువగా ఉండటం, హైబ్రిడ్ రోగనిరోధక శక్తి లేకపోవడం అనే కారణాల వల్ల చైనాలో కరోనా మరణాలు భారీగా సంభవించొచ్చట. ఈవిషయంపై లండన్‌కు చెందిన గ్లోబల్ హెల్త్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ సంస్థ హెచ్చరించింది. చైనా దేశీయంగా ఉత్పత్తి చేసిన సినోవాక్ , సినోఫార్మ్ టీకాలు కరోనా వైరస్ నుంచి బలమైన రక్షణ అందించలేవని తెలిపింది.
Also Read: China Lemons: నిమ్మకాయలకు ఎగబడుతున్న చైనీయులు.. ఎందుకో తెలుసా
ఒకవేళ 2023 ఫిబ్రవరిలో చైనాలో కరోనా విజృంభిస్తే .. అక్కడి వైద్య ఆరోగ్య వ్యవస్థ స్తంభిస్తుంది. దాదాపు 16 కోట్ల నుంచి 27 కోట్లకు పైగా కోవిడ్ కేసులు చైనాను ఉక్కిరిబిక్కిరి చేసే గండం ఉందని గ్లోబల్ హెల్త్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ సంస్థ అంచనా వేసింది. ఫలితంగా కోవిడ్ మరణాల సంఖ్య కూడా 13 లక్షల నుంచి 21 లక్షల దాకా చేరోచ్చని వివరించింది. వీటికి అడ్డుకట్ట వేయాలంటే దేశంలోని వృద్ధులకు వ్యాక్సినేషన్ ను పెంచడంపై చైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.