Site icon HashtagU Telugu

China Vs Taiwan : తైవాన్‌ను చుట్టుముట్టి.. చైనా మిలిటరీ డ్రిల్స్

China Vs Taiwan

China Vs Taiwan

China Vs Taiwan : తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్-తే బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో  చైనా ఆగ్రహంతో ఊగిపోయింది.  తైవాన్‌ సరిహద్దు ప్రాంతాల చుట్టూ భారీ సైనిక డ్రిల్‌ను ఇవాళ ఉదయం ప్రారంభించింది. రెండు రోజుల పాటు ఈ డ్రిల్‌ జరగనుంది.  ఈ డ్రిల్‌ను తైవాన్ వేర్పాటువాద చర్యలకు బలమైన శిక్షగా చైనా అభివర్ణించింది. తైవాన్ కొత్త అధ్యక్షుడిని వేర్పాటువాదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంది. ఈ డ్రిల్‌లో భాగంగా తమ దేశ యుద్ధ నౌకలు, యుద్ద విమానాలు తైవాన్ ద్వీపాన్ని చుట్టుముట్టాయని డ్రాగన్ తెలిపింది. తైవాన్‌ తమ దేశ భూభాగమే అని చైనా వాదిస్తోంది.  అయితే తమది స్వతంత్ర దేశమని తైవాన్ అంటోంది. ఈక్రమంలో తైవాన్‌కు అమెరికా అండగా నిలుస్తోంది.  వాస్తవానికి  1949 సంవత్సరంలో చైనాలో జరిగిన అంతర్యుద్ధం పర్యవసానంగా తైవాన్ తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. చైనా(China Vs Taiwan) మాత్రం తైవాన్‌ను తిరుగుబాటు చేసిన తమ దేశ ప్రావిన్స్‌గానే పరిగణిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

తైవాన్ సరిహద్దుల్లో చైనా ఆర్మీకి చెందిన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ చేపట్టిన మిలిటరీ డ్రిల్స్‌కు ‘జాయింట్ స్వార్డ్-2024ఏ’ కోడ్ అనే పేరు పెట్టారు. గురువారం ఉదయం 7:45 గంటల నుంచి ఈ డ్రిల్స్ మొదలయ్యాయి. తైవాన్ జలసంధికి ఉత్తరం, దక్షిణం, తూర్పున మూడు దిక్కుల్లో ఈ డ్రిల్ జరుగుతోంది. తైవాన్‌కు చెందిన కిన్‌మెన్, మాట్సు, ఉకియు, డోంగియిన్ దీవుల చుట్టూ కూడా విన్యాసాలు జరుగనున్నాయి. చైనా సైనిక దళాల ఉమ్మడి పోరాట సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ డ్రిల్స్‌ను నిర్వహిస్తున్నారు.

Also Read :Helicopter Crashes : హెలికాప్టర్లు ఎందుకు కూలుతాయి ? కారణాలు ఏమిటి ?

రష్యాకు చైనా ప్రమాదకర ఆయుధాల సప్లై : బ్రిటన్

చైనాపై బ్రిటన్ సంచలన ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాకు ప్రమాదకర ఆయుధాలను చైనా సప్లై చేస్తోందని బ్రిటన్ రక్షణ శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ ఆరోపించారు. దీనికి సంబంధించి తమ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు.  ఇకనైనా నాటో కూటమి మేల్కొనాలని, సైనిక వ్యయాన్ని పెంచాలని ఆయన కోరారు. నాటో కూటమిలోని దేశాలు ఆయుధ నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని బ్రిటన్ రక్షణమంత్రి పేర్కొన్నారు.

Also Read : Mokshagna Teja : నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఙ ఎంట్రీపై..