China Earthquake: 116కి చేరిన మృతుల సంఖ్య

చైనాలోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 116కి చేరుకుంది. భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. సోమవారం రాత్రి అక్కడ భూకంపం వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది

China Earthquake: చైనాలోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 116కి చేరుకుంది. భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. సోమవారం రాత్రి అక్కడ భూకంపం వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది. దీని కారణంగా గన్సు మరియు కింకై ప్రావిన్సులలోని కొన్ని గ్రామాలలో విద్యుత్ మరియు నీటి సరఫరా దెబ్బతింది. ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని, ఇళ్లకు పగుళ్లు రావడంతో ప్రజలు వీధుల్లో తలదాచుకున్నారని సమాచారం. భూకంపంలో 116 మంది మరణించగా, 200 మంది గాయపడ్డారు. సహాయక చర్యలను వేగవంతం చేశారు. భూకంపం కారణంగా కొన్ని గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందని అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు, దుప్పట్లు, స్టవ్‌లు, ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను కూడా పంపించారు. ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ 580 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు 88 ఫైర్ ఇంజన్లను విపత్తు ప్రాంతానికి పంపించింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Also Read: Rovman Powell: ఐపీఎల్ 2024 వేలం.. మొదట అమ్ముడైన ఆటగాడు ఇతనే..!