CR450 Bullet Train : అన్ని రంగాల్లోనూ అమెరికాను తలదన్నేలా చైనా దూసుకుపోతోంది. రైలు రవాణా రంగంలో ఆవిష్కరణల పరంగా ప్రపంచంలోనే టాప్ ప్లేసులో డ్రాగన్ నిలుస్తోంది. తాజాగా ‘సీఆర్450’ పేరుతో అధునాతన, అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్‌ను చైనా టెస్ట్ చేసింది. దాని పేరులోనే అసలు విషయమంతా ఉంది. వివరాలివీ..
Also Read :Boy Rescued : మధ్యప్రదేశ్‌లోని గుణలో బోరుబావిలో పడ్డ బాలుడి రెస్క్యూ.. ఆస్పత్రిలో మృతి ?
‘సీఆర్450’ బుల్లెట్ ట్రైన్.. గంటకు 450 కిలోమీటర్ల స్పీడుతో నడవగలదు. దీన్ని ఇవాళ(ఆదివారం) ఉదయమే చైనా రాజధాని బీజింగ్‌లో టెస్ట్ చేశారు. ఈ రైలు ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో.. వెంటనే గంటకు 400 కిలోమీటర్ల స్పీడును అందుకుంది. మంచి రన్నింగ్ మోడ్‌ను అందుకున్నాక.. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 453 కి.మీ వేగంతో నడవగలదని టెస్టింగ్‌లో ధ్రువీకరణ అయింది. ఈ రైలు చూడటానికి నాజుకుగా బుల్లెట్ షేపులో భలేగుంది. ఈ రైలు బాడీ బరువు 10 టన్నులే. అందువల్లే అంత స్పీడ్‌గా దూసుకెళ్లగలదు. ఇది మిగతా బుల్లెట్ రైళ్ల(CR450 Bullet Train) కంటే విద్యుత్తును కూడా 20 శాతం తక్కువగా వినియోగించుకుంటుందట. ఈ రైలును చైనా రైల్వేశాఖ వినియోగంలోకి తేవడానికి ఇంకొన్ని నెలల టైం పడుతుంది.
Also Read :Manmohan Daughters : మన్మోహన్‌సింగ్ ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారు ?
సీఆర్450 బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డును సొంతం చేసుకుంటుంది. ఈ రైలు సర్వీసులను తొలుత బీజింగ్, షాంఘై నగరాల మధ్య నడపాలని యోచిస్తున్నారట. సీఆర్450 బుల్లెట్ ట్రైన్‌ను ఎక్కితే కేవలం రెండున్నర గంటల్లోనే బీజింగ్ నుంచి షాంఘైకి చేరుకోవచ్చు. బీజింగ్ – షాంఘై నగరాల మధ్య దూరం 1200 కిలోమీటర్లు. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న సూపర్ ఫాస్ట్ రైళ్లు, బుల్లెట్ రైళ్లలో బీజింగ్ నుంచి షాంఘైకు వెళ్లేందుకు సగటున 4 గంటల టైం పడుతోంది. ఇప్పటికే చైనాలో దాదాపు 45వేల కిలోమీటర్ల పరిధిలో హైస్పీడ్ రైలు వ్యవస్థ ఉంది. పెద్దసంఖ్యలో హైస్పీడ్ రైళ్లు చైనాలో నడుస్తున్నాయి. వీటికి అనుగుణంగా వంతెనలు, ట్రాక్‌లు, సొరంగాలను నిర్మించారు.