China Warning : అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. తమ పొరుగుదేశం తైవాన్‌కు రూ.4,800 కోట్ల సైనిక సాయాన్ని అందించే ప్రతిపాదనకు అమెరికా ఆమోదం తెలపడాన్ని చైనా ఖండించింది. అమెరికా నిప్పుతో ఆడుకుంటోందని విమర్శలు గుప్పించింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదకర చర్యలను ఆపేయాలని అమెరికాకు చైనా హితవు పలికింది. ఈమేరకు ఇవాళ చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read :Allu Arjun : ఫ్యాన్స్ ముసుగులో తప్పుడు పోస్టులు.. చర్యలు తీసుకుంటాం : అల్లు అర్జున్
తైవాన్ తమదేశం పరిధిలోని భూభాగమే అని చైనా మొదటి నుంచీ వాదిస్తోంది. అయితే తమది స్వతంత్ర దేశమని తైవాన్ అంటోంది. తైవాన్ వాదనకు అమెరికా ఆది నుంచీ మద్దతుగా నిలుస్తోంది. తైవాన్‌కు ఆర్థిక సాయం, రుణాలు, సైనిక సాయాన్ని అమెరికా అందిస్తోంది. ప్రస్తుతం తైవాన్ వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. మరోవైపు దాదాపు ప్రతినెలా ఒకటి, రెండుసార్లు తైవాన్ సముద్ర జలాల్లోకి చైనా నౌకాదళం చొరబడుతోంది. తైవాన్ ఆర్మీని కవ్వించేలా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తోంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరచుగా మీడియా ముందుకు కూడా వస్తున్నాయి.
Also Read :Amazon Prime Membership : ‘అమెజాన్ ప్రైమ్’ వాడుతున్నారా ? పాస్‌వర్డ్ షేరింగ్ రూల్స్ మారుతున్నాయ్
ఈ నేపథ్యంలో ఇటీవలే తైవాన్‌కు రూ.4,800 కోట్ల సైనిక సాయాన్ని అందించే ప్రపోజల్‌కు అమెరికాలోని జో బైడెన్ సర్కారు(China Warning) పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా తైవాన్‌కు అమెరికా నుంచి యుద్ధ విమానాలు, మిస్సైళ్లు, ఇతరత్రా ఆయుధాలు అందుతాయని తెలుస్తోంది. మొత్తం మీద తైవాన్, చైనా మధ్య వాడివేడి పరిస్థితి నెలకొంది. ఏ చిన్న ఉద్రిక్తత చోటుచేసుకున్నా.. అది యుద్ధంగా మారే అవకాశం ఉంది. అమెరికా కోరుకుంటున్నది కూడా అదే. చైనాను కనీసం ఏదైనా ఒక యుద్ధంలోకి దింపాలనే వ్యూహంలో అమెరికా ఉంది. అయితేే అమెరికా పన్నాగాలకు చిక్కకుండా చైనా చాలా చాకచక్యంగా పావులు కదుపుతోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచిచూడాలి.