Shocking : అమెరికాలో బయోలాజికల్ వెపన్స్‌ను అక్రమంగా ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎఫ్బీఐ అడ్డుకుంది. చైనాకు చెందిన చెంగ్క్సువాన్ హాన్ అనే పీహెచ్‌డీ విద్యార్థిని అమెరికా భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
వుహాన్‌లోని హువాజోంగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో రీసెర్చ్ స్టూడెంట్‌గా ఉన్న హాన్‌ను జూన్ 8న డెట్రాయిట్ మెట్రోపాలిటన్ విమానాశ్రయంలో ఎఫ్బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై “బయోలాజికల్ మెటీరియల్స్‌ను అక్రమ రవాణా చేయడం”, “తప్పుడు ప్రకటనలు చేయడం” అనే అభియోగాలతో కేసులు నమోదు చేశారు. అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె అమెరికాలోకి శాస్త్రీయ ప్రయోజనాల పేరుతో ప్రమాదకరమైన జీవపదార్థాలను అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించినట్లు వెల్లడైంది.
అధికారుల ప్రకారం, హాన్ చైనాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన ల్యాబ్ నుంచి నాలుగు ప్యాకేజీలను అమెరికాలోకి తీసుకువచ్చారు. ఈ ప్యాకేజీలలో రౌండ్‌వార్మ్‌లకు సంబంధించి జీవసంబంధ పదార్థాలు ఉన్నట్లు తేలింది. అంతేకాక, వాటిలో ఒక ప్యాకేజీలో ఓ పుస్తకాన్ని దాచి ఉండటం అధికారులను అప్రమత్తం చేసింది. విచారణ సమయంలో హాన్ మొదట ఈ ప్యాకేజీల గురించి తనకు తెలియదని బుకాయించింది. అయితే తర్వాత విచారణలో అవి తనవేనని ఒప్పుకుంది.
హాన్ అమెరికాకు రాకముందే తన ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్న డేటాను డిలీట్ చేసినట్లు కూడా గుర్తించారు. ఇది దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దృశ్యంతో అమెరికా భద్రతా సంస్థలు శంకిస్తున్న విషయం ఏమంటే… చైనా ప్రభుత్వం లేదా కమ్యూనిస్టు పార్టీ (CCP)కి అనుబంధంగా ఉన్న వ్యక్తులు అమెరికాలో శాస్త్రీయ పరిశోధనల పేరు చెప్పుకుని నిజానికి జైవాయుధాల అక్రమ రవాణాలో పాల్గొంటున్నారని.
ఇది ఇలా ఉండగా, ఇది తక్కువ కాలంలో చోటుచేసుకున్న మూడవ ఘటన కావడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన చైనా పరిశోధకురాలు యుంకింగ్ జియాన్ , ఆమె ప్రియుడు జున్యోంగ్ లియు వ్యవసాయ పంటలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదకరమైన ఫంగస్‌ను అమెరికాలోకి అక్రమంగా తీసుకురావడం గమనార్హం. దీనిని అమెరికా ఆహార సరఫరా వ్యవస్థపై దాడిగా ఎఫ్బీఐ అర్థం చేసుకుంది.
ఈ పెరుగుతున్న ఘటనల నేపథ్యంలో అమెరికా నిఘా సంస్థలు చైనా విద్యార్థులపై మరింత నిఘా పెంచనున్నాయని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా బయోలాజికల్ సురక్షణ విషయంలో పెరుగుతున్న అప్రమత్తతతో, చైనాపై అమెరికా ఒత్తిడి మరింత పెంచే అవకాశముంది.
Fire Break : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న పలువురు