Site icon HashtagU Telugu

China Balloon: చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చిన అమెరికా

Chinese Spy Balloon

Resizeimagesize (1280 X 720) (2) 11zon

దక్షిణ కరోలినా తీరంలో చైనా గూఢచారి బెలూన్‌ను (China Balloon) అమెరికా కూల్చివేసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా.. చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చివేసింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న బెలూన్‌ను సూపర్‌సోనిక్ క్షిపణితో అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. చైనా ఉద్దేశాలను తెలుసుకునేందుకు వీలుగా బెలూన్ అవశేషాలను సేకరిస్తామని పెంటగాన్ తెలిపింది.గూఢచారి బెలూన్‌ షూట్‌పై చైనా రియాక్షన్‌ అమెరికా చర్యకు ఘాటైన రియాక్షన్‌ ఇచ్చింది. ఇది ఆమోదయోగ్యం కాదని చైనా పేర్కొంది. ఇలా చేయడం వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని చైనా పేర్కొంది.

బెలూన్‌ను కూల్చివేయడానికి యునైటెడ్ స్టేట్స్ బలవంతం చేయడంపై చైనా తీవ్ర అసంతృప్తిని, నిరసనను వ్యక్తం చేసింది. అనుమానిత చైనీస్ గూఢచారి బెలూన్‌ను శనివారం యూఎస్ సైనిక యుద్ధ విమానం బెలూన్‌ను కూల్చివేసిన తర్వాత చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. గత 3 రోజులుగా ఈ చైనీస్ స్పై బెలూన్ అమెరికాలోని సైనిక స్థావరంపై తిరుగుతోంది. బెలూన్ పరిమాణం మూడు బస్సులకు సమానంగా ఉంది.

చైనా గూఢచారి బెలూన్‌ను విజయవంతంగా కూల్చివేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం ప్రకటించారు. మేరీల్యాండ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. వీలైనంత త్వరగా బెలూన్‌ను కూల్చివేయాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు చెప్పారు. బైడెన్ మాట్లాడుతూ.. బుధవారం బెలూన్ గురించి నాకు సమాచారం అందించినప్పుడు, వీలైనంత త్వరగా దానిని కాల్చివేయమని పెంటగాన్‌ని ఆదేశించాననిపేర్కొన్నారు.

Also Read: Chinese Billionaires: సింగపూర్‌ కు ఎగిరిపోతున్న చైనా బిలియనీర్లు.. కారణమిదే..?

బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో.. “చైనా మానవరహిత పౌర విమానాలపై దాడి చేయడానికి యునైటెడ్ స్టేట్స్ బలవంతం చేయడం తప్పు. దానిపై తీవ్ర అసంతృప్తి, నిరసనను వ్యక్తం చేసింది.” అలా చేయడం ద్వారా అమెరికా అంతర్జాతీయ ప్రాక్టీస్ నిబంధనలను ఉల్లంఘించిందని చైనా పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. అమెరికా గగనతలంలో చైనీస్ బెలూన్‌ల విషయంలో అమెరికా- చైనాలు ముఖాముఖి తలపడ్డాయి. అందరి ముందు అహంకారం ప్రదర్శించిన డ్రాగన్ ఈ విషయంలో అమెరికాకు తలవంచింది. అమెరికా గగనతలంలో ‘గూఢచారి బెలూన్’ కనిపించడంతో.. ఈ ఘటనపై చైనా క్షమాపణలు చెప్పింది. చైనా డైలీ వార్తల ప్రకారం.. ఈ సంఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేయడం ద్వారా విచారం వ్యక్తం చేసిందని శుక్రవారం పేర్కొంది.