Site icon HashtagU Telugu

Brutally Murdered: బీచ్‌లో ముగ్గురు యువతుల దారుణ హత్య.. చిత్రహింసలు పెట్టి దారుణం

Son Killed Father

Crime Scene

ఈక్వెడార్ బీచ్ ట్రిప్‌ కోసం వెళ్లిన ముగ్గురు యువతులు అత్యంత దారుణంగా హత్య (Brutally Murdered)కు గురయ్యారు. ముగ్గురు యువతులు ఈక్వెడార్ బీచ్‌లో ట్రిప్ వేయడానికి వెళ్లారు. చాలా సరదాగా గడపాలని అనుకున్నారు. కానీ ఆ ముగ్గురు అమ్మాయిలు తమ జీవితంలో చివరి యాత్రకు వెళ్తున్నారని, ఇక తిరిగి రాలేరని అనుకోలేదు. దారుణంగా హింసించిన తర్వాత వారిని చంపేశారు. వారి మృతదేహాలు భూమిలో పాతిపెట్టి చాలా దారుణమైన స్థితిలో కనిపించాయి. వారిని 21 ఏళ్ల నైలీ తపియా, 21 ఏళ్ల యులియానా మకియాస్, 19 ఏళ్ల డెనిస్ రేనాగా గుర్తించారు. ముగ్గురి మృతదేహాలు ఏప్రిల్ 7న లభ్యమయ్యాయి. ముగ్గురి గొంతులు కోసి, మృతదేహాలు కట్టివేయబడి, నోరు మూసి ఉన్నాయి. ఏప్రిల్ 4న ముగ్గురు అదృశ్యమయ్యారు.

ఈ ముగ్గురిలో ఇద్దరు తమ బంధువులకు మెసేజ్ లు చేశారు. తాము ప్రమాదంలో ఉన్నామనే అనుమానం ఆ మెస్సేజీలో స్పష్టంగా కనిపించింది. ‘ఏదో జరగబోతున్నదనే అనుమానం వస్తున్నది’ అంటూ ఓ మెస్సేజీలో ఉన్నది. హత్యకు ముందు వారిని చాలా హింసించారని భావిస్తున్నారు. హత్య తర్వాత మృతదేహాలను ఏప్రిల్ 5న భూమిలో పాతిపెట్టారు. ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో స్థానిక మత్స్యకారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: China: చైనాలో అగ్ని ప్రమాదాలు.. 32 మంది మృతి

వారి శరీరంపై చిత్రహింసల ఆనవాళ్లు ఉన్నాయి. ఒక పోలీసు అధికారి ఇలా అన్నారు. ‘వారు చాలా చిన్న వయస్సులో ఉన్నారు. బీచ్ బట్టలు, స్నానపు సూట్లు, తేలికపాటి దుస్తులు, షార్ట్‌లు ధరించారు. ఘటనా స్థలం నుంచి ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మకియాస్ బంధువు ఆమె కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పారు. ఈ మరణాలకు మాదక ద్రవ్యాల రవాణాతో ముడిపెట్టవద్దని వారికి సూచించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఎస్మెరాల్దాస్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ హింస, నేరాల కారణంగా మార్చి 3 నుండి అత్యవసర పరిస్థితి ఉంది. ఇక్కడ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలు పరస్పరం పోట్లాడుతూనే ఉన్నాయి.

Exit mobile version