Working Hours: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న పని గంటలు.. కాకపోతే?

సాధారణంగా కొన్ని కంపెనీలలో ఉద్యోగులు ఎనిమిది గంటలు పని చేస్తే మరికొన్ని కంపెనీలలో 9 గంటలు పనిచేస్తూ

Published By: HashtagU Telugu Desk
Working Hours

Working Hours

సాధారణంగా కొన్ని కంపెనీలలో ఉద్యోగులు ఎనిమిది గంటలు పని చేస్తే మరికొన్ని కంపెనీలలో 9 గంటలు పనిచేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని కంపెనీలలో ఉద్యోగులు అంతకుమించి కూడా పనిచేసే వారు ఉన్నారు. అయితే తాజాగా చిలి ప్రభుత్వం ఆ దేశ ఉద్యోగులకు చక్కటి శుభవార్తను చెప్పింది. చిలి ఉద్యోగులకు ఆ దేశ అధ్యక్షుడు అయినా గ్రాబ్రియెల్ బోరిక్ గుడ్ న్యూస్ ని చెప్పారు. ఆ దేశంలో పనిగంటలను తగ్గించే విధంగా బిల్లులను అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వివరించారు.

కాగా 2017 లో చిలి ప్రభుత్వం ఐదేళ్ల లోపు వీక్లీ వర్కింగ్ అవర్స్ ను 45 నుంచి 45 గంటలకు తగ్గించాలి అని అప్పటి చట్ట సభ సభ్యులు, అలాగే ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధి కమీలా వల్లేజో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ ఆ బిల్లు మాత్రం అమలులో కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ క్రమంలోనే ప్రస్తుతం చిలి ప్రెసిడెంట్ అయిన గాబ్రియెల్ బోలిక్ పనిగంటలను తగ్గిస్తూ అత్యవసర బిల్లుగా పరిగన లోకి తీసుకున్నారు. అయితే చిలి రాజ్యాంగ నిబంధన ప్రకారం.. ఆ దేశ ప్రెసిడెంట్ ఏదైనా బిల్లును అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే చట్టసభ సభ్యులు ఆ బిల్లును పరిశీలించాల్సి ఉంటుంది.

కాగా సభ్యుల అంగీకారంతోనే ఆ బిల్లు అమలు కానుంది. అయితే చట్టసభ సభ్యులు బోరిక్ ఆదేశాలతో పని గంటలను తగ్గించడంతో పాటుగా అదనంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ఇళ్లలో పనిచేసే కార్మికులకు కూడా పనిగంటలను తగ్గించే అంశం పై చర్చలు జరుపుతున్నారట. అయితే తమ ప్రభుత్వం వర్కింగ్ అవర్స్ ను తగ్గించే బిల్లును వెంటనే అమలు చేసే విధంగా ఉభయ సభల సభ్యులకు విజ్ఞప్తి చేసినట్లు చిలిపి ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ తెలిపారు.

  Last Updated: 25 Aug 2022, 12:48 AM IST