Children Dragged By Train: ఘోరం.. ఇద్దరు పిల్లలను ఢీకొట్టి 100 మీటర్లు లాక్కెళ్లిన రైలు

జర్మనీ (Germany)లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ రైలు ఢీకొనడంతో ఓ చిన్నారి మరణించింది. మరో చిన్నారికి కూడా గాయాలు అయ్యాయి. జర్మనీలోని రెక్లింగ్‌హౌసెన్ పట్టణంలో గురువారం ఇద్దరు చిన్నారులు రైలు ఢీకొనడమే కాకుండా చాలా దూరం ఈడ్చుకెళ్ళింది.

  • Written By:
  • Publish Date - February 3, 2023 / 12:30 PM IST

జర్మనీ (Germany)లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ రైలు ఢీకొనడంతో ఓ చిన్నారి మరణించింది. మరో చిన్నారికి కూడా గాయాలు అయ్యాయి. జర్మనీలోని రెక్లింగ్‌హౌసెన్ పట్టణంలో గురువారం ఇద్దరు చిన్నారులు రైలు ఢీకొనడమే కాకుండా చాలా దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక వార్తాపత్రిక బిల్డ్ ఈ సమాచారాన్ని ఇచ్చింది. అయితే ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలను అందించడానికి అక్కడి అధికారులు నిరాకరించారు.

Also Read: Car Hits Bike: బైక్‌ను ఢీకొని 4 కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడిన యువకులు

అయితే, ఇది కేవలం ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్ర అనే దానిపై విచారణ జరుగుతోంది. బిల్డ్ వార్తాపత్రిక ప్రకారం.. బాధితులను గూడ్స్ రైలు వందల మీటర్లు ఈడ్చుకెళ్లిందని పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగిందో.. మరికొంత మంది చిన్నారులు గాయపడ్డారా అనేది స్పష్టంగా తెలియరాలేదు.అయితే స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. సుమారు 35 మంది అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ వర్కర్లను మాజీ ఫ్రైట్ యార్డ్ సమీపంలో క్రాష్ సైట్‌కు మోహరించారు. రెస్క్యూ టీమ్‌లు ట్రాక్ బెడ్‌ను వెతుకుతున్నాయని, బాధితుల కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయని అధికారులు చెప్పారు. ఎంత మంది గాయపడ్డారో లేదా ఎవరైనా చనిపోయారో చెప్పడానికి రెక్లింగ్‌హౌసెన్ పోలీసులు నిరాకరించారు.