Site icon HashtagU Telugu

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పెరుగుతున్న బాల కార్మికుల సంఖ్య.. ప్రతిరోజూ 15 గంటలు పని..!

Afghanistan

Resizeimagesize (1280 X 720) (3)

Afghanistan: దేశంలో బాలకార్మికుల సంఖ్య పెరుగుతోందని ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan)లోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అధిపతి హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో బాల కార్మికులు పెరగడం వంటి తీవ్రమైన సమస్యల గురించి మాట్లాడటానికి ఐక్యరాజ్యసమితి ఒక సమావేశం నిర్వహించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) అధిపతి రామిన్ బెహ్జాద్ మాట్లాడుతూ.. 2020-2021 మధ్య దేశంలో 10 లక్షల 60 వేల మంది పిల్లలు పనిచేస్తున్నారని, వారి వయస్సు 5 నుండి 17 సంవత్సరాల మధ్య ఉందని అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో 19.5 మిలియన్ల మంది పిల్లలు

టోలో న్యూస్ ప్రకారం.. దేశవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా పిల్లలు ప్రమాదకర పనులు చేస్తున్నారని ఆఫ్ఘనిస్తాన్ పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ (MOPW) మంత్రి షరాఫుద్దీన్ షరాఫ్ తెలిపారు. ఇది కాకుండా సుమారు 20 లక్షల మంది పిల్లలు వివిధ రకాల పనులు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో 19.5 మిలియన్ల (1 కోటి 95 లక్షలు) పిల్లలు ఉన్నారు. వీరిలో 1 కోటి 14 లక్షల మంది పాఠశాలలకు వెళ్తున్నారు. దేశంలో పెరుగుతున్న పేదరికం, ఆర్థిక సమస్యల కారణంగా 78 లక్షల మంది పిల్లలు బడికి వెళ్లడం లేదు. 12 లక్షల మంది చిన్నారులు ప్రమాదకర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. జాతీయ యూనియన్ అధినేత షరాఫ్ హమీది మాట్లాడుతూ దేశంలో పిల్లలు కష్టాలను ఎదుర్కొంటున్నారని, వారిలో కొందరు 15 గంటలకు పైగా పనిచేస్తున్నారని అన్నారు.

Also Read: Honda CR-V: హోండా CR-V హైబ్రిడ్ స్పోర్ట్-L వేరియంట్ విడుదల.. హోండా CR-V ఫీచర్లు ఇవే..!

‘మా పిల్లలు 24 గంటల్లో 15 గంటలకు పైగా పనిచేస్తున్నారు’

వారంలో ఎవరూ 35 గంటలకు మించి పని చేయకూడదని, అయితే మన పిల్లలు 24 గంటల్లో 15 గంటలకు పైగా పని చేస్తున్నారనేది నిజం అని ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ యూనియన్ అధినేత షరాఫ్ హమీది అన్నారు. యూనిసెఫ్ ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని 5 మంది పిల్లలలో ఒకరు బాల కార్మికులుగా ఉన్నారని ట్వీట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి బాల కార్మికులను పూర్తిగా తొలగించడమే UNICEF లక్ష్యం. తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌కు అంతర్జాతీయ సహాయం నిలిపివేయబడింది. విదేశాలలో ఉన్న దేశం $9.5 బిలియన్ల ఆస్తులను జప్తు చేసింది.

Exit mobile version