Site icon HashtagU Telugu

America: ఉత్తర తెలంగాణకు వెళ్తే జాగ్రత్త తప్పనిసరి…తన దేశ పౌరులను హెచ్చరించిన అమెరికా..!!

Indian Migrants

Indian Migrants

భారత్ లో నివాసం ఉండే తన పౌరులకు పలు హెచ్చరికలు జారీ చేసింది అమెరికా. ఉత్తరతెలంగాణతోపాటు దేశంలోని చాలా ప్రాంతాలకు ప్రయాణించవద్దని సూచించింది. దేశంలో మావోయిస్టుల కార్యకలాపాలు ప్రస్తావిస్తూ..మధ్య, తూర్పు భారత్ కు ప్రయాణం చేయకూడదని చెప్పింది. ఈ మధ్యే హైదరాబాద్ లో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు బయటపడటంతో ఈ హెచ్చరికలు చేసింది అమెరికా. తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్, జార్జండ్ లోని గ్రామీణ ప్రాంతాలు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ , ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు తీవ్రవాద గ్రూపులు పెద్దెత్తున క్రియాశీలకంగా ఉన్నాయని అమెరికా అడ్వైజరీ తెలిపింది.

జమ్మూకశ్మీర్ లో పౌర అశాంతి, ఉగ్రవాదం సాయుధ ఘర్షణలకు అవకాశం ఉందని…భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలో ప్రయాణించకూడదని అమెరికా తన పౌరులకు సూచనలు జారీ చేసింది. ట్రావెల్ అడ్వైజరీ ప్రకారం భారత్ లో వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటని అధికారులు చెబుతున్నారు. లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు పర్యాటక ప్రాంతాల్లో ఇతర ప్రదేశాల్లోనూ జరిగాయని పేర్కొంది.