Site icon HashtagU Telugu

Russia Vs West : అమెరికా యుద్ధ ట్యాంకులతో రష్యాలో ఎగ్జిబిషన్.. ఎందుకు ?

Russia Vs West

Russia Vs West

Russia Vs West : యుద్ధం అంటే శత్రువుతో ప్రత్యక్షంగా చేసే పోరాటం మాత్రమే కాదు !! పరోక్షంగా చేసే మానసిక పోరాటం కూడా యుద్ధమే !! ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్నది కూడా అదే. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్న పుతిన్.. మాస్కోలో ఓ అదిరిపోయే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏం ప్రదర్శించారో తెలుసా ? ఉక్రెయిన్‌లో తాము స్వాధీనం చేసుకున్న అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాల యుద్ధ ట్యాంకులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇటీవల ఉగ్రదాడితో మాస్కో దద్దరిల్లింది. ఫలితంగా మాస్కో పౌరుల మానసిక స్థైర్యం దెబ్బతింది. వారిలో దేశ సైన్యంపై నమ్మకాన్ని పెంచే ఉద్దేశంతోనే రాజధాని మాస్కోలో ఇతర దేశాల నుంచి స్వాధీనం చేసుకున్న యుద్ధ ట్యాంకులను ప్రదర్శనకు ఉంచారు.మాస్కోలోని పోక్లోన్నయా హిల్‌ ఏరియాపై ఈ యుద్ధ ట్యాంకులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని రష్యా ఆర్మీ(Russia Vs West) వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

ఉక్రెయిన్‌లో రష్యా స్వాధీనం చేసుకున్న యుద్ధ ట్యాంకులివీ.. 

Also Read : Prajwal Revanna : దేవెగౌడ మనవడు ప్ర‌జ్వ‌ల్‌పై జేడీఎస్‌ వేటు.. ఎందుకో తెలుసా ?

మే 9న ప్రత్యేక కార్యక్రమం

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై రష్యా సాధించిన విజయాన్ని స్మరించుకునే మే 9న ప్రత్యేక కార్యక్రమాన్ని మాస్కోలో నిర్వహించ నున్నారు. ఈసందర్భంగా  మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో విక్టరీ డే పరేడ్‌ నిర్వహిస్తారు. ఈసారి పరేడ్‌కు యుద్ధ ట్యాంకుల ప్రదర్శన అదనపు హంగుగా నిలువనుంది.  మే 9న విక్టరీ డే పరేడ్ వేళ అమెరికాను ఉద్దేశించి.. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం గురించి పుతిన్ కీలక వ్యాఖ్యలు  చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.