Shakib Al Hasan : మెంబర్ ఆఫ్ పార్లమెంట్.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్

Shakib Al Hasan : బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పొలిటికల్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టారు.

  • Written By:
  • Updated On - January 8, 2024 / 11:09 AM IST

Shakib Al Hasan : బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పొలిటికల్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ పార్లమెంటుకు ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మగురా-1 నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. ప్రధానమంత్రి షేక్ హసీన్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. 36 ఏళ్ల షకీబ్‌కు ఈ ఎన్నికల్లో 1,85,388 ఓట్లు పడ్డాయి. సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్ కాంగ్రెస్‌కు చెందిన కాజీ రెజాల్ హుస్సేన్‌కు 45,993 ఓట్లే వచ్చాయి. భారత్ వేదికగా జరిగిన 2023  వన్డే ప్రపంచకప్‌లోనూ బంగ్లాదేశ్ కెప్టెన్‌గా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు పార్లమెంట్‌కు ఎన్నికైనందున షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా కొనసాగుతారా ?క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారా ? అనేది వేచిచూడాలి. షకీబ్ అల్ హసన్‌కు మంత్రి పదవి దక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ రోజున  షకీబ్ అల్ హసన్ ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు  వైరల్‌గా మారింది. ఓటు వేసేందుకు వెళ్లిన టైంలో ఓ వ్యక్తి పదేపదే ఫొటో కోసం వేధించడంతో ఆగ్రహానికి గురైన షకీబ్(Shakib Al Hasan) అతడి చెంప చెల్లుమనిపించాడట. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఆల్ రౌండర్ (స్పిన్నర్, బ్యాట్స్‌మన్) అయిన షకీబ్ అల్ హసన్ 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 66 టెస్టులు, 247 వన్డేలు, 117 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 121 ఇన్నింగ్సుల్లో 4454 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 1 డబుల్ సెంచరీ ఉన్నాయి. బౌలింగ్‌లో టెస్టుల్లో 233 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 7570 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్.. బౌలింగ్‌లో 317 వికెట్లు తీశాడు. 117 టీ20 మ్యాచుల్లో 2382 రన్స్ స్కోర్ చేసి.. 140 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ 71 మ్యాచుల్లో 793 రన్స్ చేసి.. 63 వికెట్లు తీశాడు.

Also Read: Muslim Kar Sevak : ఆ ఇద్దరు ముస్లింలకు అయోధ్య రామమందిరం ఆహ్వానాలు.. ఎందుకంటే..

ప్రస్తుత ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు చెందిన రాజకీయ పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్‌‌ పార్లమెంటులోని 266 స్థానాల్లో పోటీచేసింది. వాటిలో 200 సీట్లలో గెలుచుకుంది. దీంతో ఐదోసారి బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టేందుకు హసీనా సిద్ధమవుతున్నారు. ప్రధాని షేక్‌ హసీనా తాను పోటీ చేసిన గోపాల్‌గంజ్‌-3 స్థానంలో బంపర్ మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఆమెకు 2,49,965 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన ఎం నిజాముద్దీన్ లష్కర్​కు 469 ఓట్లే వచ్చాయి. 1986 నుంచి ఇప్పటివరకు ఈ స్థానం నుంచి హసీనా విజయం సాధించడం ఇది(Bangladesh Elections) ఎనిమిదోసారి.