Canada : కెనడా కీలక ప్రకటన…5లక్షల మందికి పౌరసత్వం..!!

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 09:03 AM IST

కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశఅభివృద్ధిలో భాగంగా ఎనాడూ లేని విధంగా వలసలను ఆహ్వానిస్తోంది. తీవ్రమైన కార్మికుల కొరుతను ఎదుర్కొంటున్న కెనడా 2025లో రికార్డుస్థాయిలో 5లక్షల మందిని శాశ్వత నివాసితులుగా స్వాగతించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించింది కెనడా ప్రభుత్వం. 2023-2025 కోసం ఇమ్మిగ్రేషన్ లెవలింగ్ ప్రణాళికను ప్రకటించింది. 2023 ఇమ్మిగ్రేషన్ లక్ష్యాన్ని 465,000కి, 2024 లక్ష్యాన్ని వరుసగా 4 శాతం, 7.5 శాతానికి పెంచి 485,000కి పెంచింది.

కెనడా ఇమ్మిగ్రేషన్ లక్ష్యాలలో ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడంతోపాటు, కుటుంబాలను తిరిగి కలపడం, కష్టాల నుంచి పారిపోతున్న శరణార్థులకు ఆశ్రయం కల్పించడం వంటివి ఉన్నాయని CIC న్యూస్ నివేదించింది. 2021లో 405,000కంటే ఎక్కువమంది వలసదారులను స్వాగతించడం ద్వారా కెనడా తన ఆల్ టైమ్ ఇమ్మిగ్రేషన్ రికార్డును బద్దలుకొట్టింది. చాలామంది శాశ్వత నివాసితులు ఎక్స్ ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ లేదా ప్రావిన్షియల్ ఎన్ రోల్ మెంట్ ప్రోగ్రామ్ వంటి ఆర్థిక అంశాలకు సంబంధించి వలసపోతున్నారు. అయితే 2023లో 83,800ఎక్స్ ప్రెస్ ఎంట్రీ ల్యాండింగ్ లు, 2024లో 109,020, 2025లో 114,000 ఉన్నాయి.

2023లో 105,500 మంది, 2024లో 110,000, 2025లో 117,500 మంది ల్యాండింగ్‌లతో ఆర్థిక తరగతి వలసదారుల కోసం ఎంట్రీ ప్రోగ్రామ్‌గా కొనసాగుతుందని తెలిపింది. CIC న్యూస్ ప్రకారం, స్వాన్స్, పార్ట్‌నర్స్ , చిల్డ్రన్ ప్రోగ్రామ్ కింద కెనడా సంవత్సరానికి సుమారు 80,000 మంది కొత్త వలసదారులను స్వాగతించడం కొనసాగిస్తుందని వెల్లడించింది. కెనడాలో ఉన్న వారు తమ బంధువులను ఎంట్రీ ప్రోగ్రామ్ ద్వారా తీసుకెళ్లేందుకు 2023లో 28,500కి, తర్వాత 2024లో 34,000, 2025లో 36,000కి పెరగనున్నాయి.

కెనడాలో ఆగస్ట్‌లో 958,500 ఓపెన్ రోల్స్ ఉన్నాయని..1 మిలియన్ మంది నిరుద్యోగులుగా ఉన్నారని ఇటీవలి ఉద్యోగ ఖాళీల డేటా చూపించింది. దేశవ్యాప్తంగా 17 పరిశ్రమల్లోని 563 మంది తయారీదారులు, ఎగుమతిదారుల కార్మిక సర్వేలో దేశవ్యాప్తంగా కార్మిక, తయారీ నైపుణ్యాల కొరత కారణంగా గత సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థకు దాదాపు $13 బిలియన్ల నష్టం వాటిల్లిందని నివేదించింది. మీడియా నివేదికల ప్రకారం, కెనడాలో ప్రతి మహిళకు 1.4 మంది పిల్లల తక్కువ జనన రేటు కారణంగా కార్మికుల కొరత ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యల్పంగా ఉంది. CIC న్యూస్ నివేదికల ప్రకారం, 9 మిలియన్ల మంది లేదా కెనడా జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది 2030 నాటికి పదవీ విరమణ వయస్సును చేరుకుంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో కార్మికుల కొరతను సృష్టిస్తుంది. ఈ కారణంతోనే కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.