Warning Labels On Each Cigarette : ఇక ప్రతి సిగరెట్ పై వార్నింగ్ లేబుల్

Warning Labels On Each Cigarette : "సిగరెట్లు క్యాన్సర్‌కు కారకం" అనే మెసేజ్ ఇప్పటివరకు సిగరెట్ పెట్టెలపై ఉండేది.. 

  • Written By:
  • Updated On - August 2, 2023 / 07:20 AM IST

Warning Labels On Each Cigarette : “సిగరెట్లు క్యాన్సర్‌కు కారకం” అనే మెసేజ్ ఇప్పటివరకు సిగరెట్ పెట్టెలపై ఉండేది.. 

ఇకపై ఏకంగా ప్రతి సిగరెట్ పై  “సిగరెట్లు క్యాన్సర్‌కు కారకం” అనే మెసేజ్ డిస్ ప్లే అవుతుంది.. 

దేశ ప్రజల ఆరోగ్యం కోసం .. యూత్ ను సిగరెట్లకు దూరం చేసేందుకు ఈ సంచలన నిర్ణయాన్ని కెనడా ప్రభుత్వం తీసుకుంది. 

ఈవిధంగా ప్రతి సిగరెట్ పై క్యాన్సర్ వార్నింగ్ లేబుల్ ను ప్రింట్ చేయబోతున్న మొదటి దేశం కెనడానే..    

ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలలో ఉండే ఈ హెచ్చరికలలో సిగరెట్ కు ఒకవైపు(నిలువులో)  “సిగరెట్లు క్యాన్సర్‌కు కారకం” అని .. మరోవైపు (నిలువులో)  “ప్రతి పఫ్‌లో విషం”  అని రాసి ఉంటుంది.  

Also read : Emoji : ఆ ఎమోజీ(emoji)వాడితే జైలుకే, భారీ జరిమానా కూడా… ఎక్కడో తెలుసా?

నార్మల్ సిగరెట్లకు సంబంధించి ఆగస్టు 1 నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈవిధంగా వార్నింగ్  లేబుల్స్ తో కింగ్ సైజ్ సిగరెట్స్ ను తయారు చేసేలా యంత్రాలను అప్ గ్రేడ్ చేసుకునేందుకు కంపెనీలకు 2024 జూలై వరకు టైం ఇచ్చారు.  2025 ఏప్రిల్ నాటికి అన్ని నార్మల్ సైజ్ సిగరెట్లు, టిప్పింగ్ పేపర్, ట్యూబ్‌లతో కూడిన చిన్న సిగార్‌లపై కూడా తప్పనిసరిగా ఈ  వార్నింగ్ లేబుల్ ను డిస్ ప్లే చేయాలి.   అంటే వచ్చే సంవత్సరం నుంచి కెనడియన్లు ఈ కొత్త హెచ్చరిక లేబుల్‌లను సిగరెట్లపై  చూడటం ప్రారంభిస్తారు. ఇక సిగరెట్లలో మూలకు ఉండే  ఫిల్టర్లపై కూడా పిల్లల ఆరోగ్యానికి హాని, అవయవాలకు దెబ్బ, నపుంసకత్వం, లుకేమియా ముప్పు అనే పదాలను డిస్ ప్లే చేస్తారు. ఈ చర్యల ద్వారా 2035 నాటికి దేశంలో  పొగాకు ప్రోడక్ట్స్  వినియోగాన్ని 5 శాతానికి  తగ్గించాలని(Warning Labels On Each Cigarette) కెనడా భావిస్తోంది. పొగాకు వాడకం వల్ల ప్రతి సంవత్సరం 48,000 మంది కెనడియన్లు చనిపోతున్నారు.

Also read : Coriander Rice : కొత్తిమీర రైస్.. సింపుల్ గా ఇంట్లో ఎలా తయారుచేయాలో తెలుసా..?