Site icon HashtagU Telugu

Indian Students : భారత విద్యార్థులకు కెనడా బ్యాడ్ న్యూస్.. స్టడీ పర్మిట్లు తగ్గింపు

Foreign Students In India

Foreign Students In India

Indian Students : కెనడాలో ప్రస్తుతం ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఈ సమస్యలను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇక నుంచి విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, విదేశీ వర్కర్లకు పని అనుమతులపై మరిన్ని ఆంక్షలను అమల్లోకి తెస్తామని వెల్లడించింది. ఈమేరకు ఎక్స్ వేదికగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ప్రకటన విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో విదేశీ విద్యార్థులకు 35శాతం తక్కువగా స్టడీ పర్మిట్లు ఇస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది స్టడీ పర్మిట్ల సంఖ్యను మరో 10శాతం వరకు తగ్గిస్తామని చెప్పారు. కెనడా ఆర్థిక వ్యవస్థకు వలసలు ప్రయోజకరమే అయినప్పటికీ, కొన్ని దుష్ట శక్తులు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని నియంత్రించేందుకు తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.కెనడాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా చేపట్టిన సర్వేల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ ప్రభుత్వం వెనుకంజలో ఉంది. దీంతో కెనడా జాతీయుల(Indian Students) మెప్పును పొందేందుకు ట్రూడో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు.

Also Read :Lebanon Explosions : పేజర్లు, వాకీటాకీల పేలుడు.. 32కు చేరిన మృతులు

Also Read :Food Chemicals: మానవ శరీరంలో 3,600 కంటే ఎక్కువ ఆహార ప్యాకేజింగ్ రసాయనాలు..!