Site icon HashtagU Telugu

Canada Kalithan: కెన‌డాలో పంజాబ్ `ఖ‌లీస్తాన్` క‌ల‌క‌లం

Canda Kalisthan

Canda Kalisthan

కెన‌డా దేశానికి పంజాబ్ లోని అమృత్ పాల్ సింగ్ (Canada Kalisthan) వ్య‌వ‌హారం వెళ్లింది. ఆ దేశ హౌస్ ఆఫ్ కామ‌న్స్ లో ఒక ప్ర‌శ్న‌గా ఇండో కెన‌డియ‌న్ ఇక్వింద‌ర్ ఎస్ గ‌హీర్ ప్ర‌శ్నించారు. దానికి కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ (molani joly)స్పందిస్తూ పంజాబ్ వ్య‌వ‌హారాన్ని చాలా క్లోజ్ గా ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. రాడికల్ బోధకుడు అమృతపాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసుల అణిచివేత, పంజాబ్ స‌మాజంలోని ఆందోళ‌న త‌దిత‌ర అంశాల‌ను తెలుసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు.

కెన‌డా దేశానికి పంజాబ్ లోని అమృత్ పాల్ సింగ్ వ్య‌వ‌హారం(Canada Kalisthan) 

“పంజాబ్‌లోని పరిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కెనడా దేశం(Canada Kalisthan) రిపోర్టుల‌ను సేక‌రిస్తోంది. అక్క‌డ తిరిగి శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి కంట్రోల్ లోకి రావాల‌ని కోరుకుంటున్న‌ట్టు జోలీ వెల్ల‌డించారు. కెన‌డాలోని పంజాబీలు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం నుంచి అధికారిక స‌మాచారాన్ని పొంద‌డానికి ఏర్పాట్లు చేశారు. పంజాబ్‌లో ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేయడంపై హౌస్ లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. భారతదేశంలోని పరిస్థితిని హౌస్‌లో అప్‌డేట్ చేయమని గహీర్ కోర‌డం జ‌రిగింది. అందుకు జోలీ (molani joly) పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.

ప్రేరేపిత కథనాలను నమ్మవద్దని విదేశాల‌లోని ఎన్నారైల‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ (Canada Kalisthan) 

అమృత్‌పాల్ సింగ్‌పై (Canada Kalisthan) చ‌ర్య‌ల గురించి విదేశీ నాయకులు, పార్లమెంటేరియన్లు వ్యాఖ్యానించడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. సోషల్ మీడియాలో కొన్ని అంశాలు ప్రసారం చేస్తున్నవి నిజం కాద‌న్నారు. ప్రేరేపిత కథనాలను నమ్మవద్దని విదేశాల‌లోని ఎన్నారైల‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కోరారు. పంజాబ్‌లోని అధికారులు అమృత‌పాల్ ను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఆ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారులు రోజూ పంచుకుంటార‌ని తెలిపారు.

Also Read : Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. ఖండించిన భారత కాన్సులేట్ కార్యాలయం

రాడికల్ బోధకుడు నేతృత్వంలోని ‘వారిస్ పంజాబ్ దే’ అంశాలకు వ్యతిరేకంగా పోలీసులు అణిచివేతను ప్రారంభిస్తూ గత వారం రాష్ట్రంలో ఇంటర్నెట్ , SMS సేవలను ఆపివేశారు. పంజాబ్ పోలీసులు అమృతపాల్ సింగ్ కోసం వెతుకుతూనే ఉన్నారు. అంతకుముందు (Canada Kalisthan)కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో హౌస్ ఆఫ్ కామన్స్‌లో “మేము మరింత స్థిరమైన పరిస్థితికి వేగంగా తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాము.“ అంటూ కామెంట్ చేశారు.

మిస్సిసాగాలోని ఒక రామమందిరాన్ని ‘ఖలిస్థానీ తీవ్రవాదులు(Canada Kalisthan) 

కెన‌డాలోని కొన్ని హిందూ దేవాలయాలను ఖలిస్తాన్ (Canada Kalisthan)మద్దతుదారులు ధ్వంసం చేశారు. ఇటీవల భారత వ్యతిరేక కార్యకలాపాలు కూడా పెరిగాయి. ఫిబ్రవరి 13న మిస్సిసాగాలోని ఒక రామమందిరాన్ని ‘ఖలిస్థానీ తీవ్రవాదులు’ భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. టొరంటోలోని భారత కాన్సులేట్ నుండి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. “మిసిసాగాలోని రామమందిరాన్ని భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేయ‌డాన్ని అక్క‌డి కేంద్ర ప్ర‌భుత్వం ఖండించింది. ఘటనపై విచారణ జరిపి నేరస్థులపై సత్వర చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను అభ్యర్థించామ‌ని టొరంటోలోని భారత కాన్సులేట్ ట్వీట్ చేసింది.

Also Read : Canada : కెనడా కీలక ప్రకటన…5లక్షల మందికి పౌరసత్వం..!!