Canada: హ్యాండ్ గన్స్ అమ్మకాలను నిషేధించిన కెనడా…దేశంలో తుపాకీ హింస పెరుగుతోందని..!!

కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో తుపాకీ కల్చర్ పెరుగుతుండటంతో..వాటిని అరికట్టేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

  • Written By:
  • Publish Date - October 22, 2022 / 09:49 AM IST

కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో తుపాకి కల్చర్ పెరుగుతుండటంతో..వాటిని అరికట్టేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే దేశంలో హ్యాండ్ గన్స్ పై పూర్తిగా నిషేధం ప్రకటించింది. నిబంధనలు గత శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ చర్య దేశంలో చేతి తుపాకీ దిగుమతులను నిషేధించే మునుపటి ప్రయత్నాలపై ఆధారపడి ఉంటుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు.

తుపాకీ హింసను పరిష్కరించడానికి ట్రూడో …40ఏళ్లలో దేశంలో బలమైన తుపాకీ నియంత్రణ చర్యలు అమలు చేసే ప్రతిపాదిత చట్టంతోపాటు హ్యాండ్ గన్ ఫ్రీజ్ మేలో ప్రకటించారని ప్రధాని కార్యాలయం తెలిపింది. అయితే తుపాకీ నిషేధాన్ని పశ్చిమ ప్రావిన్స్ ఆఫ్ అల్బెర్టా ప్రభుత్వం విమర్శించింది. ఇది ఒట్టావా ప్రతిపాదించిన ఇతర తుపాకీ నియంత్రణ చర్యలను ప్రతిఘటిస్తుందని గతంలోనే వివరించింది.

కాగా తుపాకీ హింస పెరుగుతుందని. మేము చూస్తూ ఉండలేము. చర్యలు తీసుకోవల్సిన బాధ్యత మాపై ఉందంటూ ట్రూడో తెలిపారు. కెనడియన్ పబ్లిక్ సేఫ్టీ మంత్రి మార్కో మెండిసిన్ కెనడాలో తుపాకీ హింససై నిషేధం అత్యంత ముఖ్య చర్యగా పేర్కొన్నారు. ట్రూడో పాలక లిబరల్ ప్రభుత్వం తుపాకీ హింసతో పోరాడేందుకు సి21బిల్లును ప్రవేశపెట్టింది. ఆగస్టులో చట్టం ఆమోదించే వరకు దిగుమతులను నిషేధించింది.