Canada H-1B Visa: హెచ్‌-1బీ వీసాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కెనడా

భారతీయ యువత అమెరికా-కెనడా (Canada H-1B Visa) వంటి పెద్ద దేశాలకు వెళ్లే ధోరణి పెరిగింది.

  • Written By:
  • Publish Date - June 29, 2023 / 06:44 AM IST

Canada H-1B Visa: భారతీయ యువత అమెరికా-కెనడా (Canada H-1B Visa) వంటి పెద్ద దేశాలకు వెళ్లే ధోరణి పెరిగింది. ఇటీవల పీఎం మోడీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ప్రభుత్వం (US ప్రభుత్వం) H-1B వీసా నిబంధనలను సడలించడం గురించి మాట్లాడింది. ఇప్పుడు కెనడా ప్రభుత్వం కూడా H-1B వీసా హోల్డర్ల కోసం ఒక పెద్ద అడుగు వేసింది. ఇది వీసా హోల్డర్ల కుటుంబాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ మాట్లాడుతూ.. 10,000 US H-1B వీసా హోల్డర్‌లు దేశంలోకి వచ్చి పని చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఓపెన్ వర్క్-పర్మిట్ స్ట్రీమ్‌ను రూపొందిస్తుందని ప్రకటించారు. అలాగే ఈ ప్రోగ్రాం కింద వారి కుటుంబసభ్యులు చదువుకునేందుకు, పనిచేసేందుకు వీలుగా కూడా అనుమతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందకు సంబంధించి కెనడా వలసలు, శరణార్థులుస పౌరసత్వ సేవల శాఖ ప్రకటన విడుదల చేసింది.

Also Read: Chiranjeevi : చిరంజీవి సినిమా ఓపెనింగ్‌కి ముగ్గురు స్టార్ హీరోలు.. బాలకృష్ణ పుట్టినరోజున రిలీజ్..

ఈ కొత్త ప్రోగ్రామ్‌ కింద ఆమోదం పొందిన హెచ్‌-1బీ వీసాదారులకు మూడేళ్లలో ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది. వారు కెనడాలో ఎక్కడైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం పేర్కొంది. ఇక వారి భాగస్వాములు, డిపెండెంట్లు కూడా కెనడాలో ఉద్యోగం, చదువుకునేందుకు తాత్కాలిక నివాస వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఏడాది చివరికి ఈ ఇమ్మిగ్రేషన్‌ స్ట్రీమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఇమ్మిగ్రేషన్‌ మంత్రి ఫ్రేజర్‌ తెలిపారు. అయితే దీనికి ఎవరు అర్హులు, ఎంతమందికి ప్రవేశాలు కల్పిస్తారనే దానిపై మంత్రి స్పష్టత ఇవ్వలేదు. అయితే జులై 16, 2023 నాటికి హెచ్‌-1బీ వీసాలో అమెరికాలో పనిచేస్తున్నవారు, ఈ వీసాదారులతో వచ్చే కుటుంబసభ్యులు కూడా కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.