FIFA Worldcup : వణికిస్తోన్న కేమిల్ ఫ్లూ…అప్రమత్తమైన ఖతార్…!!

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 07:19 PM IST

ఫిపా వరల్డ్ కప్ నేపథ్యంలో ఖతార్ అప్రమత్తమైంది. మ్యాచ్ లు వీక్షించేందుకు వచ్చే ఫుట్ బాల్ అభిమానులకు కొత్త వైరస్ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో అభిమానులను అప్రమత్తం చేసింది. కొత్త వైరస్ గురించి న్యూ మైక్రోబ్స్ అండ్ న్యూ ఇన్ఫెక్షన్స్ జర్నల్ లో ఒక అధ్యయనం ప్రచురితం అయ్యింది. ఇన్ఫెక్షన్స్ రిస్క్ అసోసియేటేడె విత్ ది 2022 ఫిఫా వరల్డ్ కప్ ఇన్ ఖాతర్ పేరుతో ఈ మధ్యే ఈ అధ్యయానాన్ని ప్రచురితం చేసింది. ఈ నివేదికను ప్రపంచఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరించింది. కోవిడ్ 19, మంకీపాక్స్, కేమిల్ ఫ్లూ లేదా మెర్స్ వంటి వ్యాధులు వ్యాపించే ఛాన్స్ ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్స్ అలర్ట్ చేసింది.

కేమిల్ ఫ్లూ ను మెర్స్ అని కూడా పిలుస్తారు. ఇదొక శ్వాసకోశ వ్యాధి. ఈ వైరస్ మానవులు, జంతువులలో కనిపిస్తుంది. ఈ వ్యాధి ఒంటెల ద్వారా పెద్దెత్తున వ్యాపిస్తుంది. ఈ మధ్యే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కేమిల్ ఫ్లూను మహ్మారిగా మార్చగల వైరస్ ల జాబితాలో చేర్చింది. ఈ వైరస్ బారినపడ్డవారు మూడింతలో ఒక వంతు అంటే దాదాపు 35శాతం మంది మరణించే ఛాన్స్ ఉందని పేర్కొంది.

కేమిల్ ఫ్లూ లక్షణాలు
ఈ కేమిల్ ఫ్లూ లక్షణాలు దాదాపుగా కోవిడ్ ను పోలి ఉంటాయి. జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం, అతిసారం ఇవన్నీ కూడా ప్రధాన లక్షణాలు. 60ఏళ్ల పై బడినవారు…రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు..ఇప్పటికే తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారు…ఎక్కువగా వైరస్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఎలా వ్యాపిస్తుంది
ఈ ఫ్లూ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఈ ఫ్లూ సోకిన ఒంటెలు ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా మానవులకు సోకుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఫ్లూ సోకిన ఒంటె మాంసం ద్వారా కూడా సోకుతుంది. అయితే ఈ ఫ్లూకు ఇంకా టీకా కానీ చికిత్స కానీ అందుబాటులో లేదు. ఒంటెపాలు, ఒంటె మాంసం చాలా ప్రమాదకరమైన WHOహెచ్చరిస్తోంది. దీని వల్ల మనుషులక వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఖతార్ వెళ్లే ప్రయాణికులు ఒంటెలకు దూరంగా ఉండాలని..వాటిని తాకకూడదని నిపుణులు సూచిస్తున్నారు.