కాంబోడియా దేశ ప్రధాని హున్‌సెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్, జపాన్ పీఎం ఫుమియో సహా ఇతర ప్రపంచం నేతలతో సమావేశం నిర్వహించిన తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే తాను జీ20 సమ్మిట్ కోసం ఇండోనేసియా వచ్చిన తర్వాత కొవిడ్ పాజిట్‌గా నిర్ధారణ అయిందని హున్‌సెన్ ధృవీకరించారు.
ప్రధాని హున్‌సెన్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ విధంగా పోస్ట్ చేశారు. సోమవారం రాత్రి కరోనా పాజిటివ్ పరీక్షలు చేశారు. మంగళవారం ఉదయం ఇండోనేషియా వైద్యుడు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ధృవీకరించారని పేర్కొన్నారు. తాను కంబోడియాకు తిరిగి వస్తున్నానని, G-20తో పాటు బ్యాంకాక్‌లో జరగనున్న APEC ఎకనామిక్ ఫోరమ్‌లో తన సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వైరస్ నాకు ఎప్పుడు వచ్చిందో ఖచ్చితంగా తెలియదు. కానీ నేను వచ్చినప్పుడు, ఇండోనేషియన్లు నా నుండి పరీక్ష కోసం నమూనాలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం అది కోవిడ్ -19 పాజిటివ్‌గా నిర్ధారించబడింది. తాను ఆలస్యంగా బాలి చేరుకోవడం, ఇతర నేతలతో కలిసి విందును కోల్పోవడం అదృష్టమని ఆయన అన్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా.. కంబోడియన్ ప్రతినిధి బృందం మంగళవారం స్వదేశానికి తిరిగి రానుంది. అంతేకాకుండా ఈ వారం చివరలో బ్యాంకాక్‌లో జరిగే APEC శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సమావేశాలను కూడా రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.