చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

సిస్టమ్ పక్కనే కొందరు సైనికులు నిలబడి ఉండగా, ఒకరు మొబైల్‌లో వీడియో తీస్తున్నారు. వరుసగా ఆరు రాకెట్లను ప్రయోగించిన తర్వాత, అకస్మాత్తుగా ఆ రాకెట్ సిస్టమ్ పేలిపోయి మంటలు వ్యాపించాయి.

Published By: HashtagU Telugu Desk
Cambodia

Cambodia

Cambodia: పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ చైనాకు చెందిన JF-17 థండర్ ఫైటర్ జెట్‌లను లిబియాకు విక్రయించినప్పటికీ చైనా ఆయుధాల డొల్లతనం నిరంతరం బయటపడుతూనే ఉంది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత తాజాగా థాయ్‌లాండ్-కాంబోడియా సరిహద్దు వివాదంలో చైనా నిర్మిత రాకెట్ సిస్టమ్ ప్రయోగిస్తున్న సమయంలోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కాంబోడియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం ఎలా జరిగింది?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంబోడియా సైనికులు చైనాకు చెందిన మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ (MLRS) ద్వారా రాకెట్లను ప్రయోగిస్తున్నారు. సిస్టమ్ పక్కనే కొందరు సైనికులు నిలబడి ఉండగా, ఒకరు మొబైల్‌లో వీడియో తీస్తున్నారు. వరుసగా ఆరు రాకెట్లను ప్రయోగించిన తర్వాత, అకస్మాత్తుగా ఆ రాకెట్ సిస్టమ్ పేలిపోయి మంటలు వ్యాపించాయి.

రష్యా సాంకేతికతను కాపీ కొట్టిన చైనా (PHL-81)

కాంబోడియా సైన్యం ఉపయోగిస్తున్న ఈ PHL-81 టైప్ రాకెట్ సిస్టమ్‌ను చైనా తయారు చేసింది. ఇది 80వ దశకంలో సోవియట్ యూనియన్ (రష్యా) రూపొందించిన ‘BM-21 గ్రాడ్’ రాకెట్ సిస్టమ్‌కు నకలు. విశేషమేమిటంటే,భారత సైన్యం కూడా ఇటువంటి ‘గ్రాడ్’ MLRSలను ఉపయోగిస్తోంది. ఇవి 20-22 సెకన్లలో 40 రాకెట్లను ప్రయోగించగలవు. అయితే చైనా తయారు చేసిన వెర్షన్ విఫలం కావడంతో వారి సైనిక పరికరాల విశ్వసనీయతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: బాబు పై కేసుల కొట్టివేత, వైసీపీ నేతల ఏడుపు బాట

లిబియాతో ఆసిమ్ మునీర్ అబద్ధాలు

ఇటీవల ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియాతో పాకిస్తాన్ JF-17 ఫైటర్ జెట్ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ లిబియాకు ఒక అబద్ధం చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఈ చైనా యుద్ధ విమానాలు భారతదేశానికి చెందిన రాఫెల్, సుఖోయ్ విమానాలను కూల్చేశాయని ఆయన పేర్కొన్నారు. కానీ వాస్తవానికి భారత విమానాలను కూల్చినట్లు పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు చూపలేదు. కనీసం విమాన శకలాల ఫోటోలు లేదా వీడియోలు కూడా విడుదల చేయలేకపోయింది.

బ్రహ్మోస్ క్షిపణిని గుర్తించలేకపోయిన చైనా డిఫెన్స్ సిస్టమ్

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ HQ-9, LY-80 లు ఘోరంగా విఫలమయ్యాయి. భారత్ జరిపిన వైమానిక దాడులను, బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగాన్ని ఇవి కనీసం గుర్తించలేకపోయాయి. భారత క్షిపణులను అడ్డుకోవడం పక్కన పెడితే అవి వస్తున్నట్లు కూడా చైనా టెక్నాలజీ పసిగట్టలేకపోవడం గమనార్హం.

  Last Updated: 26 Dec 2025, 04:34 PM IST