Israel Blast: సెంట్రల్ ఇజ్రాయెల్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఆగి ఉన్న మూడు బస్సుల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. అధికారులు దీన్ని ఉగ్రదాడిగా భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదన్నది ఉపశమనకరమైన విషయం. మరణాలు సంభవించలేదన్న సమాచారం ఉన్నప్పటికీ, దాడి పట్ల ఇజ్రాయెల్ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది, ఎందుకంటే ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజా నుంచి నలుగురు బందీల మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్‌లో ఇప్పటికే అసంతృప్తి నెలకొన్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇవి మాత్రమే కాకుండా, మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే అవి పేలలేదని, బాంబు స్క్వాడ్ వాటిని నిర్వీర్యం చేసిందని పోలీసులు తెలిపారు. ఐదు బాంబుల రూపకల్పన ఒకే విధంగా ఉండడం గమనార్హం. వాటికి టైమర్లు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.
Sonia Gandhi: ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
ఈ ఘటనపై ఇజ్రాయెల్ నగర మేయర్ బ్రోట్ స్పందిస్తూ, ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడకపోవడం అదృష్టకరమని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ ఘటనపై స్పందించగా, సైనిక కార్యదర్శి నుండి అన్ని వివరాలు స్వీకరిస్తున్నట్లు, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే, షిన్ బెట్ అంతర్గత భద్రతా సంస్థ ఈ పేలుళ్లపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఒకే అనుమానితుడు ఈ పేలుళ్లకు కారణమా? లేక బహుళ అనుమానితులు పాల్గొన్నారా? అనే అంశంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసు ప్రతినిధి హైమ్ సర్గ్రోఫ్ పేర్కొన్నారు. గురువారం జరిగిన ఈ పేలుళ్లకు ఉపయోగించిన పదార్థాలు వెస్ట్ బ్యాంక్‌లో గతంలో ఉపయోగించిన పేలుడు పదార్థాలతో పోలి ఉన్నాయని తెలిపారు. అయితే, వాటి ప్రత్యేకతలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.
జనవరి 19న గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుండి, తుల్కరేమ్ నగరంలోని రెండు శరణార్థి శిబిరాలు వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైనిక దాడులకు కేంద్రంగా మారాయి. గతంలో ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి నగరాల్లో కాల్పులు, బాంబు దాడులు నిర్వహించిన ఘటనలు ఉన్నాయి. ఈ పేలుళ్ల అనంతరం, బాట్ యామ్ మేయర్ బ్రోట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత పెంచారు. ఈ పేలుళ్లకు బాధ్యులైన వారిని త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ భద్రతా సంస్థలు కసరత్తు ప్రారంభించాయి.
Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు.. ఓ మంచి రికార్డు!