Pakistan : ఇరాన్ దేశంలోని సెంట్రల్ రీజియనల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 28 మంది పాకిస్తానీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందికి తీవ్ర గాయాలు కాగా, 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈవివరాలను ఇరాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యాజ్ద్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపాయి.
We’re now on WhatsApp. Click to Join
వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన షియా వర్గీయులు చాలామంది ఇరాక్‌లోని షియా పవిత్ర స్థలాల సందర్శనకు వెళ్తుంటారు. ఈక్రమంలో 51 మంది పాకిస్తానీ షియా వర్గీయులు ఒక బస్సులో ఇరాక్‌కు బయలుదేరారు. పాకిస్తాన్ నుంచి ఇరాన్‌కు , అక్కడి నుంచి ఇరాక్‌కు చేరుకోవచ్చు. ఈక్రమంలోనే ఇరాన్ మీదుగా వీరి బస్సు వెళ్తుండగా.. దాని బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పి లోయలో పడింది. అయితే ఈ ప్రమాదంలో 35 మంది పాకిస్తానీయులు చనిపోయారంటూ పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చనిపోయిన వారంతా పాకిస్తాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న లర్కానా ప్రాంత ప్రజలు అని తెలిపాయి.
Also Read : Starbucks CEO : రోజూ విమానంలో ఆఫీసుకు.. ఆ కంపెనీ సీఈఓకు బంపర్ ఆఫర్
700 మంది ఉద్యోగులకు చేదు అనుభవం
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ మోనాల్ మూతపడింది. దీంతో అందులో పనిచేసే 700 మంది అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇస్లామాబాద్‌లోని మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లో ఉన్న అన్ని రెస్టారెంట్‌లను మూసివేయాలని పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఇటీవలే ఆదేశించింది. దీంతో మిగత రెస్టారెంట్లతో పాటు ఈ రెస్టారెంటు కూడా మూతపడింది. ఇస్లామాబాద్ టూర్‌కు వెళ్లే వారిలో చాలామంది రెస్టారెంట్ మోనాల్‌కు వెళ్తుంటారు. తమ సంస్థ మూతపడిందని తెలుసుకొని ఉద్యోగుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఓ ఉద్యోగి స్పృహ తప్పి పడిపోయాడు. అందరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో పాక్ మీడియాలో వైరల్ అయింది. ఉద్యోగం కోల్పోవడం ఎవరికైనా చాలా ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఒక ఫ్యామిలీ ఉంటుంది.