British Man Fined: సిగరెట్ పీక రోడ్డుపై వేసినందుకు రూ.55 వేల జరిమానా.. ఎక్కడంటే..?

సిగరెట్ పీకను రోడ్డుపై పడేసినందుకు లండన్ కోర్టు 55 వేల రూపాయల (558 పౌండ్లు) జరిమానా విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని థార్న్‌బరీ నగరంలో జరిగింది. అలెక్స్ డేవిస్ (Alex Davis) అనే వ్యక్తి సిగరెట్ తాగుతూ తన సిగరెట్ పీకను రోడ్డుపై పడేశాడు.

  • Written By:
  • Publish Date - January 17, 2023 / 01:35 PM IST

సిగరెట్ పీకను రోడ్డుపై పడేసినందుకు లండన్ కోర్టు 55 వేల రూపాయల (558 పౌండ్లు) జరిమానా విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని థార్న్‌బరీ నగరంలో జరిగింది. అలెక్స్ డేవిస్ (Alex Davis) అనే వ్యక్తి సిగరెట్ తాగుతూ తన సిగరెట్ పీకను రోడ్డుపై పడేశాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్ట్రీట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అలెక్స్‌కు 15 వేల రూపాయల (150 పౌండ్లు) జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశించారు. కానీ, అధికారుల ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన అధికారులు అలెక్స్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

కేసును విచారించిన న్యాయమూర్తి అలెక్స్ కు రూ. 55 వేల జరిమానా విధించారు. సిగరెట్లు కాల్చడం, ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల రోడ్లన్నీ చెత్తాచెదారం అవుతాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) ప్రకారం.. సిగరెట్ పీకలు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా విస్మరించబడిన వ్యర్థ పదార్థం. ప్రతి సంవత్సరం సుమారుగా 766.6 మిలియన్ కిలోగ్రాముల విషపూరిత చెత్తను కలిగి ఉంటుంది.

Also Read: PM Shehbaz: పాక్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు.. భారత్ తో యుద్ధాల నుంచి పాఠాలు..!

సముద్రపు పర్యావరణ వ్యవస్థలను మైక్రోప్లాస్టిక్స్ లీకేజీలకు గురిచేసేలా బీచ్‌లలో ఇది అత్యంత సాధారణ ప్లాస్టిక్ చెత్తగా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం పొగాకు పరిశ్రమ ఆరు ట్రిలియన్ సిగరెట్లను ఉత్పత్తి చేస్తుంది. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ ధూమపానం చేసేవారు వినియోగిస్తున్నారు. ఈ సిగరెట్‌లలో ప్రధానంగా సెల్యులోజ్ అసిటేట్ ఫైబర్స్ అని పిలువబడే మైక్రోప్లాస్టిక్‌లతో కూడిన ఫిల్టర్‌లు ఉంటాయి. సరిగ్గా పారవేసినప్పుడు సిగరెట్ పీకలను సూర్యరశ్మి, తేమ వంటి కారకాలు విచ్ఛిన్నం చేస్తాయి. మైక్రోప్లాస్టిక్‌లు, భారీ లోహాలు, అనేక ఇతర రసాయనాలను విడుదల చేస్తాయి. పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం, సేవలపై ప్రభావం చూపుతుంది.