National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో వారం రోజుల పాటు చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇక చేనేత దినోత్సం ఒక్క ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ భారతీయ చేనేతకు ఆదరణ లభిస్తుంది. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్‌లో బ్రిటీష్ ఇండియన్ మహిళలు చీరలు ధరించి ప్రత్యేకంగా ‘సారీ వాకథాన్ 2023’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బ్రిటీష్ ఉమెన్ ఇన్ శారీస్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దీప్తి జైన్ మాట్లాడుతూ.. భారతీయ చేనేత కార్మికులను ప్రోత్సహించడం, కార్మికుల్ని ఆదుకోవడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ క్రమంలోనే చేనేత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 500 మందికి పైగా మహిళలు తమ ప్రాంతీయ చేనేత చీరలు ధరించి, ట్రఫాల్గర్ స్క్వేర్ నుండి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక తెలంగాణ నుంచి 40 మందికి పైగా మహిళలు తెలంగాణ నుంచి గద్వాల్, పోచంపల్లి, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట, గొల్లభామ వంటి చేనేత చీరలతో వాకథాన్‌లో పాల్గొన్నారు.
Also Read: Man Assault Woman : హైదరాబాద్ లో నడిరోడ్డు ఫై మహిళను వివస్త్రను చేసిన కీచకుడు