Breast Milk Coffee : తల్లి పాలతో కాఫీ.. స్పెష‌ల్ ప్లాన్స్ ప్ర‌క‌టించిన కేఫ్‌.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిదే

ర‌ష్యాలోని పెర్మ్ న‌గ‌రంలో కాఫీ స్మైల్ అనే కేఫ్‌(Café) ఉంది. ఈ కేఫ్ పేరు ప్ర‌స్తుతం ర‌ష్యాలోని సోష‌ల్ మీడియాలో మారుమోగుతుంది.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 09:30 PM IST

మ‌నంద‌రికీ ఉద‌యాన్నే లేచి టీ(Tea), కాఫీ(Coffee) తాగ‌డం అల‌వాటు. ప‌లు ర‌కాల జంతువుల పాల‌తో ఈ టీలు, కాఫీలు త‌యారు చేస్తుంటారు. కానీ, మీరు ఎప్పుడైన త‌ల్లి పాల‌తో కాపీ(Breast Milk Coffee) త‌యారు చేయొచ్చ‌ని మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక ర‌ష్య‌న్ కేఫ్ బ్రెస్ట్ మిల్స్ కాఫీతో త‌యారు చేసిన కాఫీని అందించ‌డానికి ప్లాన్ చేసింది. ఇది ప్ర‌స్తుతం ర‌ష్య‌న్(Russia) సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. అప్పుడే పుట్టిన పిల్ల‌ల‌కు త‌ల్లిపాలు ఎంతో మేలు చేస్తుంద‌ని వైద్యులు చెబుతుంటారు. ప్ర‌భుత్వాలుసైతం శిశువుకు త‌ల్లిపాలు ఎంతో ముఖ్య‌మ‌ని, త‌ల్లిపాలు ఆరు నెల‌లు పాటు ఇవ్వ‌డం ద్వారా శిశువులో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరిగి అనేక ఆనారోగ్యాలు దూర‌మ‌వుతాయ‌ని ప్ర‌చారం చేస్తుంది.

ర‌ష్యాలోని పెర్మ్ న‌గ‌రంలో కాఫీ స్మైల్ అనే కేఫ్‌(Café) ఉంది. ఈ కేఫ్ పేరు ప్ర‌స్తుతం ర‌ష్యాలోని సోష‌ల్ మీడియాలో మారుమోగుతుంది. అడిటీ సెంట్ర‌ల్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్ర‌కారం.. కాఫీ స్మైల్ కేఫ్‌ యాజ‌మాన్యం.. త‌ల్లిపాల‌తో త‌యారు చేసిన కాఫీని అందించ‌డం ప్రారంభించింది. నెల‌రోజుల ముందుగానే ఇందుకు సంబంధించిన ప్ర‌చారాన్ని కేఫ్‌ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి యాడ్‌కూడా రూపొందింది. అయితే, ఇది వివాదానికి దారితీసింది. సోష‌ల్ మీడియాలో కొంద‌రు నెటిజ‌న్లు త‌ల్లిపాల‌తో కాఫీ త‌యారిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

కాఫీ స్మైల్ కేఫ్ యాజ‌మాన్యం విడుద‌ల చేసిన ప్ర‌చార వీడియోలో ఒక మ‌హిళ తాను హెయిర్ స్టైలిస్ట్ న‌ని. ప్ర‌స్తుతం తాను బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు తెలిపింది. త‌న బిడ్డ పుట్టాక పెద్ద‌గా త‌ల్లిపాలు తాగ‌డం లేదు. దీంతో మిగిలిన పాల‌తో అద‌న‌పు డ‌బ్బు సంపాదించాల‌ని ఆలోచించాను. నా భ‌ర్త‌కోసం నేను నా పాల‌తో కాఫీకూడా త‌యారు చేశాన‌ని ఆమె తెలిపింది. కేఫ్ యాజ‌మాని మాట్లాడుతూ.. ప్రారంభంలో రోజుకు కేవ‌లం 40-45 డోసుల హ్యూమ‌న్ బ్రెస్ట్ మిల్క్ క‌లిపిన డ్రింక్స్ అందించ‌గ‌ల‌మ‌ని, ఏడాది చివ‌రి నాటికి దాదాపు వెయ్యి వ‌ర‌కు అందిస్తామ‌ని చెప్పాడు. కాగా త‌ల్లిపాల‌తో త‌యారు చేసిన కాఫీ ప్రొడ‌క్ట్ ధ‌ర‌ను రూ. 660 గా నిర్ణ‌యించారు.

 

Also Read : Rupee vs Dollar: ఒక్క డాలర్‌కు 82.46 రూపాయలు.. బలపడుతున్న దేశీ కరెన్సీ విలువ..!