Site icon HashtagU Telugu

Adriana Thyssen : అంతుచిక్కని వ్యాధితో మరణించిన హెల్త్ అండ్ ఫిట్ నెస్ ఇన్‌ఫ్లూయన్సర్

Brazil Fitness Influencer Adriana Thyssen Passed away with Health Issues

Brazil Fitness Influencer Adriana Thyssen Passed away with Health Issues

సోషల్ మీడియా(Social Media)లో రోజురోజుకూ ఇన్‌ఫ్లూయన్సర్ల(Influencers) సంఖ్య పెరిగిపోతోంది. రీల్స్ చేసి పాపులర్ అవుతూ.. ఇన్‌ఫ్లూయన్సర్లుగా మారుతున్నారు. వీరిలో యువత ఎక్కువగా ఉంటోంది. అలాగే ఫిట్ నెస్ ఫ్రీక్స్, డాక్టర్లు, గృహిణులు ఎక్కువగా ఇన్‌ఫ్లూయన్సర్లుగా ఉంటున్నారు. తాజాగా.. బ్రెజిల్ కు చెందిన హెల్త్ అండ్ ఫిట్ నెస్ ఇన్‌ఫ్లూయన్సర్ అడ్రియానా థైసెన్ (49)(Adriana Thyssen) అంతుచిక్కని వ్యాధితో మరణించింది. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ మీడియా సంస్థ వెల్లడించింది.

సోషల్ మీడియాలో డ్రికాగా పేరొందిన థైసెన్ సౌ పోలోలోని తన ఉబెర్లాండియా అపార్ట్మెంట్ లో విగతజీవిగా పడి ఉన్నట్లు తెలిసింది. ఆమె మరణానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని డ్రికా కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. ఫిట్ నెస్ ట్రైనర్ అయిన డ్రికా.. వెయిట్ లాస్ గురించి ఎప్పటికప్పుడు ఇన్‌స్టా‌గ్రామ్ లో అప్డేట్స్ ఇస్తుండేది. గతేడాది ఆమె ఏకంగా 45 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమెకు ఇన్ స్టాలో 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

తన శరీర బరువును తగ్గించుకునేందుకు తానెంత కష్టపడిందో, ఏయే వర్కవుట్స్ చేసిందో, ఏ డైట్ ను తీసుకుందో ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేది. టీనేజ్ నుంచీ తాను అధిక బరువుతో బాధపడుతున్నానని చెప్పిన డ్రికాగా.. 39 ఏళ్ల వయసులో తన శరీర బరువు 100 కేజీలు ఉందని.. ఆ తర్వాత డిప్రెషన్ నుంచి తేరుకుని శరీర ఆకృతిపై శ్రద్ధ పెట్టానని పలు వీడియోలలో తెలిపింది. డ్రికా ఆకస్మిక మృతిపట్ల ఆమె ఫాలోవర్స్ సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. పాత పోస్టులకు కామెంట్స్ చేస్తున్నారు.