Site icon HashtagU Telugu

Shubhneet Singh: సింగర్ శుభ్ షోను రద్దు చేసిన బుక్‌మైషో

Shubhneet Singh

Shubhneet Singh

Shubhneet Singh: గత రెండ్రోజులుగా భారత్ కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు పచ్చి గడ్డి వేస్తే మగ్గుమనేలా తయారయ్యాయి. ఈ క్రమంలో పంజాబీ-కెనడియన్ సింగర్ శుభనీత్ సింగ్ పెట్టిన పోస్ట్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది.ఆ ఒక్క పోస్టుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఈ ఏడాది జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ (45) హత్యలో ఢిల్లీ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కెనడా వాదనను భారత్ తప్పుబట్టింది. దీంతో ఢిల్లీలో ఉన్న కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దీంతో వివాదం చెలరేగింది.అయితే ఏ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చాడు సింగర్ శుభనీత్ సింగ్. తన సోషల్ మీడియాలో ఇండియా మ్యాప్ ని వక్రీకరిస్తూ పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా పంజాబ్, హర్యానాలను ప్రత్యేక దేశాలుగా చూపించాడు. దీంతో దేశవ్యాప్తంగా శుభ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

సింగర్ శుభ్ ఇండియాకు రావాల్సి ఉంది. ఇక్కడ తన షోలను ప్రదర్శించేందుకు సిద్దమయ్యాడు. అందుకోసం బుక్‌మైషో ద్వారా టికెట్లను కూడా విక్రయించారు. షో చూసేందుకు లక్షలాది మంది ఆసక్తి చూపించారు. అయితే తాజాగా శుభ్ పెట్టిన ఒక్క పోస్టుతో వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో అతన్ని పలువురు బహిష్కరించడంతో బుక్‌మైషో బుధవారం శుభనీత్ సింగ్ భారత పర్యటనను రద్దు చేసింది. బుక్‌మైషో 7-10 రోజుల్లో టిక్కెట్లను వాపసు చేస్తామని తెలిపింది. బుక్ మై షో శుభనీత్ సింగ్ భారత పర్యటనకు స్పాన్సర్‌గా ఉంది.

Also Read: DSC 2023: నేటి నుంచే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు ఎంతంటే..?

Exit mobile version