కొన్ని రోజులుగా బాంబు పేలుళ్లు (Bomb Exploded) పెరుగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ బలూచిస్థాన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో బాంబు పేలుడు (Bomb Exploded) కలకలం సృష్టిస్తోంది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. దీనికి ఇంకా ఏ గ్రూప్ బాధ్యత తీసుకులేదని తెలిపారు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో శనివారం జరిగిన బాంబు పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, గాయపడిన ఏడుగురిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. అవరన్ జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీని ఉపయోగించినట్లు బాంబు నిర్వీర్య దళానికి ఆధారాలు లభించాయని చెప్పారు.
బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుద్దూస్ బిజెంజో ఒక ప్రకటనలో ఈ సంఘటనను ఖండించి, సంతాపం తెలిపారు. పౌరులు, భద్రతా సిబ్బంది, ఇతర ప్రావిన్సులకు చెందిన కార్మికులపై అనేక తీవ్రవాద దాడులతో ఈ సంవత్సరం బలూచిస్తాన్ హింసాకాండకు కేంద్రంగా ఉంది. గత నెల ప్రావిన్స్‌లోని హోషబ్, కోహ్లు ప్రాంతాల్లో భద్రతా దళాలు జరిపిన రెండు ఆపరేషన్లలో నిషేధిత తిరుగుబాటు గ్రూపు బలూచ్ రిపబ్లికన్ ఆర్మీకి చెందిన 19 మంది అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు.
Also Read: Snake in Plane: ఎయిరిండియా విమానంలో పాము.. ప్రయాణికులలో కలకలం
సుమారు 3 నెలల క్రితం కూడా పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు జరిగగా అందులో కనీసం ఎనిమిది మంది గాయపడిన విషయం తెలిసిందే. క్వెట్టాలోని మెకోంగి రోడ్డులో మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు షాపుపై హ్యాండ్ గ్రెనేడ్ విసరడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి దుకాణం కిటికీ అద్దాలు పగిలిపోయాయని పోలీసులు తెలిపారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.